iDreamPost
iDreamPost
తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్‌లు కొరడా ఝుళిపించారు. దీంతో ఇసుక, గుట్కా అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు ఆటలు కట్టించారు. ఇందులో ఇసుక రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనిది కాగా, గుట్కా/ఖైనీ స్వాధీనం కాకినాడ జిల్లా పరిధిలో జరిగింది.
రాజమహేంద్రవరం గాయత్రి ఇసుక ర్యాంపు 2, 4, ధవళేశ్వరం పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా డ్రెడ్జింగ్ మెషిన్లను వినియోగించి గోదావరి నదిలో ఇసుక తవ్వుతున్న ముగ్గురు వ్యక్తులను స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో వారు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు డ్రెడ్జింగ్ మెషిన్‌లను, మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 519.18 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసారు. దీనిపై ధవళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. కాగా ఇసుక అక్రమ తవ్వకాలపై 9490760793, 7981019787 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, అలా సమాచారం ఇచ్చేవారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఎస్‌ఈబీ అధికారులు కోరుతున్నారు.
అలాగే కాకినాడ రూరల్ తూరంగి శివార్లలోని రొంగలి పైడియ్య చేపల చెరువుల వద్దనున్న షెడ్డులో నిల్వ ఉంచిన రూ. 35,85,550ల లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పోలీస్‌లు పట్టుకున్నారు. గుట్కా కేసుల్లో పాత నిందితుడిగా ఉన్న నున్న హరినా«ద్ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఒరిస్సా నుంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తీసుకు వచ్చి జిల్లాలో అమ్ముతున్నాడు. వీటిని చేపల చెరువు షెడ్డు వద్ద దిగుమతి చేస్తుండగా ఇంద్రపాలెం పోలీస్‌లు పట్టుకున్నారు. 7,17,1110 ప్యాకెట్లు, లారీ, ఆటో, రూ. 21,350ల నగదు పోలీస్‌లు సీజ్ చేసారు. కాగా నిందితులపై పీడీ యాక్టు క్రింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.