iDreamPost
android-app
ios-app

బాలయ్య కోసం ఒక్క సినిమా హీరోయిన్

  • Published Nov 10, 2020 | 7:42 AM Updated Updated Nov 10, 2020 | 7:42 AM
బాలయ్య కోసం ఒక్క సినిమా హీరోయిన్

నందమూరి బాలకృష్ణ బోయపాటి శీనుల కాంబోలో రూపొందుతున్న సినిమా తాలూకు హీరోయిన్ అప్డేట్ ఎట్టకేలకు ఒకటి వచ్చింది. సాయేషాను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈమె ఎవరు అంటే వెంటనే గుర్తురాకపోవచ్చు కానీ 2015లో అక్కినేని అఖిల్ ఎంట్రీ ఇఛ్చిన ఫస్ట్ మూవీలో తనకు జోడిగా నటించింది సాయేషానే. ఆ తర్వాత తెలుగులో ఇంకే ఆఫర్లు రాలేదు కానీ కోలీవుడ్ లో మాత్రం చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు చేసింది. అవి తెలుగులో కూడా డబ్ అయ్యాయి. కార్తీ చినబాబులో చేసింది. ఇక్కడ పెద్దగా ఆడలేదు కానీ తమిళంలో ఓ మోస్తరుగా ఎబోవ్ యావరేజ్ అనిపించుకుని తనవరకు ప్లస్ అయ్యింది.

ఆ తర్వాత విజయ్ సేతుపతితో ఓ సినిమా చేసింది కానీ ప్లాప్ అయ్యింది. గత ఏడాది వచ్చిన సూర్య బందోబస్త్ చేసింది కూడా సాయేషానే. ఇది డిజాస్టర్ కొట్టింది. ఇలా డబ్బింగ్ సినిమాల రూపంలో తప్ప సాయేషా ఇప్పటిదాకా చేసిన స్ట్రెయిట్ మూవీ అఖిల్ ఒక్కటే. అల్లు అర్జున్ విలన్ గా నటించిన ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఆ తర్వాత కొత్తగా కమిట్ మెంట్స్ ఏవీ ఇవ్వలేదు. కన్నడలో చేసిన యువరత్న విడుదల కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పుడు మళ్ళీ బాలయ్య సినిమానే ఒప్పుకోవడం.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మీద బాలయ్య లేని సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఓ ఆర్టిస్టుకి కరోనా పాజిటివ్ రావడంతో కొంత బ్రేక్ ఇచ్చినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇంకా మెయిన్ క్యాస్టింగ్ సెట్ లో అడుగు పెట్టలేదు. పూర్ణ మాత్రమే మరో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. అంజలి కూడా ఉంటుందన్నారు కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. తమన్ సంగీతం సమకూరుస్తున్నఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ మార్చి లోగా షూటింగ్ అయిపోతేనే అది సాధ్యమవుతుంది.