స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహరించిన తీరు పలు సంచలనాలకు వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఒక పార్టీకి మేలు జరిగేలా ఎన్నికలు వాయిదా వేస్తూ అయన తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తనకి రాష్ట్ర ప్రభుత్వం నుండి రక్షణ కావాలని నిమ్మగడ్డ పేరున కేంద్రానికి లేఖ వెళ్ళడం అందులో ఆయన ఉపయోగించిన పదజాలం రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యం కలిగించింది.
మొదటి నుండి రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తూ వచ్చిన నిమ్మగడ్డ వ్యవహారశైలి తెలుగుదేశం పార్టీకి మేలు జరిగేలా ఉందని, వీరికి ఆ పార్టీతో లోపాయకారీగా వ్యక్తిగత సంబంధాలు ఉండటం వలనే ఇలా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే అధికార పార్టీ చేసిన విమర్శలు నిజం అయ్యేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం నుండి బీజేపీలొకి వెళ్ళిన సుజనా చౌదరి, తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసిన కామినేనిలను రహస్యంగా హైదరాబాద్ హయాత్ హోటల్ లో కలుసుకోవడం , గంటల తరబడి చర్చించడం అవి వీడియో రూపంలో బయటికి రావడంతో నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బహిర్గతం అయింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా కేసు ఉనప్పుడు ఆ సాకుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ నేడు వేయికి పైగా కేసులు నమోదవుతున్న సమయంలో తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాతే ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాలి అని స్పష్టంగా చెప్పినా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిమ్మగడ్డ నిర్వహించడం ఆయన ఒంటెద్దు పోకడికి నిదర్శనంగా కనిపిస్తుంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యహరిస్తూ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంపై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. నిమ్మగడ్డ వ్యవహారశైలి మొదటినుండి గమనిస్తూ వస్తున్న నెటిజన్లు తాజా మీటింగ్ పై స్పందిస్తు గతంలో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమీషనర్ గా హయాత్ హోటల్లో రహస్యంగా ఎల్లో లోటస్ మిత్రులతో కలిసినదానికి ఈరోజు బహిరంగంగా కలిసి సమావేశం పెట్టుకున్న సమావేశానికి ఏమైనా తేడా ఉందా?? దొరకక ముందు రహస్యం .. దొరికాక బహిరంగం అంతే తేడా!!! అంటూ సెటైర్లు వేస్తున్నారు.. ఏది ఏమైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికల కమీషనర్ గా ఎంతో గౌరవాన్ని సంపాదించాల్సిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దేశంలో ఏ ఎన్నికల కమీషనర్ మూటకట్టుకోనంత అప్రతిష్టను మూటకట్టుకున్నారు అనడంలో సందేహం లేదు.