iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ ఓపెనింగ్స్ కు డేంజర్ బెల్

  • Published May 11, 2022 | 6:28 PM Updated Updated May 11, 2022 | 6:28 PM
టాలీవుడ్ ఓపెనింగ్స్ కు డేంజర్ బెల్

కరోనా రాకముందు పెద్ద స్టార్ హీరో సినిమా మొదటి రోజు టికెట్లు దొరకడమంటే పెద్ద అడ్వెంచర్ లా ఉండేది. దాదాపు అన్ని ఆటలు అడ్వాన్స్ బుకింగ్ లోనే ఫుల్ అయిపోయేవి. కానీ ఇటీవలి పరిణామాలు విభిన్నంగా కనిపిస్తున్నాయి. ఆచార్యకు రెండో షో నుంచే జనం తగ్గడం మొదలయ్యింది. సర్కారు వారి పాటకు ప్రీ రిలీజ్ వైబ్రేషన్స్ పాజిటివ్ గా ఉన్నా సులభంగానే ఆన్ లైన్ బుకింగ్స్ లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అశోక వనంలో అర్జున కళ్యాణం బాగానే ఉందన్నారు కానీ తీరా చూస్తే థియేటర్లు ఖాళీ. జయమ్మ పంచాయితీ, భళా తందనానలకు వచ్చిన లక్షల కలెక్షన్ కంటే జనం లేక క్యాన్సిల్ చేసిన షోలే చాలా ఎక్కువ.

ఎందుకీ పరిస్థితి వచ్చిందని తరచి చూస్తే ఆడియన్స్ ఆలోచనా ధోరణి చాలా మారుతోంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లను విపరీతంగా ఆదరించారు కానీ అదే స్థాయిలో స్పందన వస్తుందని ఆశించి అత్యాశకు పోతున్న ఇతర సినిమాల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల చర్యలు కలెక్షన్లకు గండి పెడుతున్నాయి. ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి కదాని రేట్లను 50 నుంచి 150 రూపాయల దాకా ప్రతి టికెట్ మీద పెంచుకుంటూ పోవడం సాధారణ ప్రేక్షకులను హాలుకు దూరం చేస్తోంది. వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీ తో సినిమాలు చూసే అలవాటున్న వాళ్ళు సైతం దానికి బదులు వేరే బెటర్ ఆప్షన్ ఏముంటుందాని ఎంటర్ టైన్మెంట్ ప్లాన్లను మార్చుకుంటున్నారు.

దానికి తోడు మీడియం రేంజ్ సినిమాలకు సైతం నైజామ్ మల్టీ ప్లెక్సుల్లో 200 రూపాయల దాకా టికెట్ రేట్ పెట్టడం వాటి వసూళ్లను దెబ్బ తీస్తోంది. ఆ ధరకు అయిదుగురు ప్రేక్షకులు వస్తే ఎక్కువ రెవిన్యూ వస్తుందా లేక 125 రూపాయలకు పాతిక మంది వస్తే ఎక్కువ వస్తుందా అనే బేసిక్ లాజిక్ మర్చిపోతున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఎగ్జిబిటర్లు నష్టపోయేది పెద్దగా ఉండకపోవచ్చు. కానీ భవిషత్తుని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఇలా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ని ఖరీదైన వ్యవహారంగా మార్చేయడం మున్ముందు వేరే పరిమాణాలకు దారి తీస్తుంది. దానివల్ల కలిగే లాభం ఒక్క ఓటిటి రంగానికి మాత్రమే ఉంటుంది. ఇది గుర్తించి మేల్కొంటే మంచిది