iDreamPost
android-app
ios-app

రసవత్తరంగా టాలీవుడ్ సంక్రాంతి పందెం

  • Published Dec 22, 2020 | 6:54 AM Updated Updated Dec 22, 2020 | 6:54 AM
రసవత్తరంగా టాలీవుడ్ సంక్రాంతి పందెం

2021 సంక్రాంతి పందేనికి పుంజులు సిద్ధమవుతున్నాయి. ముందు ఎవరు వస్తారు ఎవరు డ్రాప్ అవుతారనే అనుమానాలు మెల్లగా వీడుతున్నాయి. రవితేజ ‘క్రాక్’ ధైర్యంగా ప్రకటన చేయడంతో మిగిలినవాళ్లు కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. నిజానికి ముందుగా లాక్ చేసుకున్నది విజయ్ ‘మాస్టర్’. ఇది రావడంలో ఎలాంటి మార్పు లేదు. అనూహ్యంగా ఏదైనా ఉత్పాతం జరిగితే తప్ప. జనవరి 13న గ్రాండ్ ప్రీమియర్స్ తో సిద్ధంగా ఉండండని ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించినట్టు తెలిసింది. క్రాక్ మరుసటి రోజు జనవరి 14న థియేటర్లలో అడుగు పెడుతుంది. దీనికి భారీ ఎత్తున స్క్రీన్లు కేటాయించబోతున్నారు.

ఇక రామ్ ‘రెడ్’ ఏ డేట్ లో వస్తాడనేది ఎల్లుండి విడుదల చేయబోయే ట్రైలర్ లో రివీల్ చేయబోతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం 11 లేదా 15 ఉండొచ్చని అంటున్నారు. నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఏ నిర్ణయం తీసుకున్నారో ఇంకా తెలియదు. వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న రానా ‘అరణ్య’ కూడా తేదీ ఇంకా ఫైనల్ చేయలేదు. రావడంలో అనుమానాలు అక్కర్లేదు. తాజాగా అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ కూడా రేస్ లో దిగే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు జనవరి 2021 అని ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు కానీ డేట్ చెప్పలేదు. ఇక్కడ థియేటర్ల సర్దుబాటు, స్క్రీన్ల కౌంట్ వీటన్నింటి విషయంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి.

అయితే ఉప్పెన, వైల్డ్ డాగ్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి కొంత ఆలస్యం చేయక తప్పదు. అంతా సర్దుకుంటోంది కరోనా వెళ్లిపోయిందని సంబరపడుతున్న తరుణంలో యుకెలో కొత్త వైరస్ ఒకటి మారినంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుండటం పరిశ్రమ వర్గాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పుడు అలాంటి ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా ఈసారి కోలుకోవడం అంత సులభం కాదు. అలా జరగకూడదనే అందరి ఆకాంక్ష. ఈ నెల 25న సోలో బ్రతుకే సో బెటరూతో నిజమైన సందడి షురూ కాబోతోంది