iDreamPost
iDreamPost
లాక్ డౌన్ వల్ల ప్రపంచం మొత్తం ఎంతగా అతలాకుతలం అయ్యిందో చూస్తూనే ఉన్నాం. పరిశ్రమలు ఒక్కొక్కటిగా తేరుకుంటున్నాయి కానీ ఎటొచ్చి సినిమా రంగమే ఇంకా అష్టకష్టాలు పడుతోంది. ఎనిమిది నెలల తర్వాత థియేటర్లు తెరిచినా ఆ ఆనందం పెద్దగా కనిపించడం లేదు. వంద శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతించినప్పుడే పరిస్థితి చక్కబడుతుందని డిస్ట్రిబ్యూటర్ వర్గాల అభిప్రాయం. దీని సంగతలా ఉంచితే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల లిస్టు అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
ఎవరిది ముందు వస్తుందో ఎవరు లేట్ గా రిలీజ్ చేస్తారో అంతు చిక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు బ్రదర్స్ జంటల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. రకరకాల కారణాల వల్ల లాక్ డౌన్ కు ముందే కొంత లేట్ అయిన ఈ బ్రదర్స్ మూవీస్ ఇప్పుడు ఫైనల్ స్టేజికి వచ్చేశాయి. బ్యాచిలర్ ని సంక్రాంతి కానుక అని ప్రకటించారు కానీ ఆలోగా ఏమైనా మార్పు జరిగినా ఆశ్చర్యం లేదు. కానీ లవ్ స్టోరీకి సంబంధించి పోస్టర్లు వదలడం తప్ప ఇంకెలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. 2021 జనవరికే వస్తుందా లేక ఇంకా ఆలస్యమవుతుందా లాంటి క్లూస్ ఏమి ఇవ్వడం లేదు. శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక మెగా ఫామిలీ నుంచి సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇదే పరిస్థితిని ఎదురుకుంటున్నారు. సోలో బ్రతుకే సో బెటరూ డిసెంబర్ అని చెప్పేశారు కానీ క్రిస్మస్ కన్నా ముందు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆ నెల కూడా 50 శాతం ఆక్యుపెన్సీనే కొనసాగేలా ఉండటంతో నిర్మాతలు అంత ధైర్యం చేస్తారా అనేది వేచి చూడాలి. ఇక వైష్ణవ్ తేజ్ థన్ డెబ్యూ మూవీ ఉప్పెనతో పాటు క్రిష్ దర్శకత్వంలో చేసిన ఇంకో సినిమాను కూడా పూర్తి చేశాడు. ఇంకో నెలలో రెండు కాపీలు రెడీ అయిపోతాయి. కానీ రిలీజ్ విషయంలోనే క్లారిటీ మిస్ అవుతోంది. మొత్తానికి ఇలా బ్రదర్స్ జంట ఒకే సమస్యను ఎదురుకోవడం కరోనా మహాత్యమే