సమంత, అక్షయ్ కుమార్‌తో కలిసి కాఫీ విత్ కరణ్ 7లో అరంగేట్రం చేసింది. కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా కాన్ఫిడెంట్ గా సమాధానలిచ్చింది. తేడా వచ్చినప్పుడు కడిగేసింది.
కరణ్ షోలో సమంత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. డైవోర్స్, పర్సనల్ లైఫ్ నుంచి సినిమాల వరకు నిజాయితీగా మాట్లాడింది. అవకాశం వచ్చినప్పుడు చెలరేగపోయింది. అంతెందుకు, షో హోస్ట్ కరణ్ జోహార్‌ను ట్రోల్ చేసే అవకాశం వస్తే వదలిపెట్టలేదు.
ఈ ఎపిసోడ్‌లో, కరణ్ జోహార్ నాగ చైతన్యతో డైవోర్స్ గురించి సమంతను అడిగాడు. అప్పుడే నాగ చైతన్యను భర్తగా పిలిచాడు. దీనికి సమంత వెంటనే సర్దిచెప్పి ‘మాజీ భర్త’ అని చెప్పింది. జోహార్ తనను తాను సరిదిద్దుకున్నాడు.
కాఫీ విత్ కరణ్ అంటేనే వ్యక్తిగత జీవితంమీద, పడకగది యవ్వారాల మీద, గాసిప్స్ మీద చాలా ప్రశ్నలుంటాయి. సెలబ్రిటీ లైఫ్ గురించి అందరికీ ఆసక్తేకదా!
నాగ చైతన్యతో పెళ్లి ఎందుకు పెటాకులైందని అడిగి, మీ వ్యక్తిగత జీవితంలోకి రానని కరణ్ జోహార్ చెప్పాడు. దానికి సమంత రెస్పాన్స్ ఇచ్చింది. కెమెరా వెనుక అన్ని ప్రశ్నలు అడిగారుకదా, మళ్లీ కెమేరా ముందు అడుగుతారా అని అడిగింది.
షోలో సమంతా కరణ్ మీద ఒక కామెంట్ చేశారు. విఫలమైన వివాహాలకు కరణ్ జోహార్ కారణమని భావించారు. తన సినిమాల వల్లే పెళ్లిపై ప్రజలకు గొప్ప అభిప్రాయాలు ఎర్పడుతున్నాయని, పెళ్లిని K3Gగా చిత్రీకరిస్తున్నాడని, అయితే అది KGF అని వ్యాఖ్యానించింది. కరణ్ జోహార్ విడాకులపై కభీ అల్విదా నా కెహ్నా(Kabhi Alvida Na Kehna)ని కూడా చేశానని చెప్పి , తనను తాను సమర్ధించుకొనే ప్రయత్నం చేసినప్పుడు, అంతా మునిగిపోయిన తర్వాత తీశారని సమంత దెప్పిపొడిచింది.
కరణ్ జోహార్ ర్యాపిడ్-ఫైర్ రౌండ్ లో, క్యూ కార్డ్ ని చదవడానికి తన కళ్లజోడును మార్చుకున్నాడు. 50 ఏళ్లు నిండాయని, తనకు కళ్లద్దాలు కావాలని సరదగా అడగడంతో, సమంత ఈజ్ దట్ బ్యాడ్ అంటూ నవ్వుతూ అడిగింది.
ఇక, గేమ్ ఆడుతున్నప్పుడు అక్షయ్ కుమార్‌కి కరణ్ జోహార్ ఆప్షన్‌లు కూడా తెలియకుండానే సరైన సమాధానం చెప్పినందుకు, ఒక పాయింట్ ఇచ్చినప్పుడు, ఫౌల్ ప్లే అన్న సమంత, హోస్ట్‌పై సరదాగా సెటైర్ విసిరింది, ఈ గేమ్‌ను ‘బాలీవుడ్ vs సౌత్’గా మారుస్తానని చెప్పింది. కరణ్ జోహార్ అలా చేయలేనని చెప్పాడు.
ఎక్కడా తడబాటులేదు. బాలీవుడ్ లో పాగావేయడానికి ప్లాన్ చేసిన సమంత, కాఫీ విత్ కరణ్ ను ఒక వేదికగా మార్చుకుంది. ఫ్యాన్స్ ను పెంచుకుంది.