iDreamPost
android-app
ios-app

రేసులో ముందుకొస్తున్న సలార్

  • Published Dec 23, 2020 | 7:04 AM Updated Updated Dec 23, 2020 | 7:04 AM
రేసులో ముందుకొస్తున్న సలార్

ప్రకటన వదిలి పట్టుమని నెలరోజులు కూడా కాలేదు ప్రభాస్ కొత్త సినిమా సలార్ తాలూకు పనులు వేగవంతం అయ్యాయి. ఇటీవలే కెజిఎఫ్ 2 షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దాని టీజర్ ఫైనల్ కట్ ని ఓకే చేశాక పూర్తిగా డార్లింగ్ సినిమా మీద దృష్టి పెట్టబోతున్నాడు. కెజిఎఫ్ విడుదల సమ్మర్ కంటే ముందు జరిగే అవకాశం లేదు కాబట్టి ప్రమోషన్ పరంగా కూడా టెన్షన్ పడాల్సింది ఏమి లేదు. కొద్దిభాగం మినహా పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సలార్ ని జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ లోకి తీసుకెళ్ళబోతున్నారు. ప్రభాస్ ఫస్ట్ డే నుంచే జాయిన్ అవుతాడు.

యాక్షన్ డ్రామానే అయినప్పటికీ సాహో రేంజ్ లో మితిమీరిన బడ్జెట్ కాకుండా చాలా ప్లాన్డ్ గా రీజనబుల్ గా తీయబోతున్నారని తెలిసింది. కథ డిమాండ్ మేరకు ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే కేటాయించేలా ప్రశాంత్ పక్కా స్కెచ్ తో ఉన్నారట. ముందు హైదరాబాద్ లో మొదలుపెట్టి ఆ తర్వాత బెంగుళూరులో కంటిన్యూ చేయబోతున్నారు. అన్నీ రియల్ లొకేషన్స్ ఉండబోతున్నాయని తెలిసింది. ఇది మల్టీ లాంగ్వేజ్ లో తీయబోతున్నారా లేక కన్నడ వెర్షన్ ను డబ్బింగ్ తో సరిపెడతారా అనేది తెలియాల్సి ఉంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సలార్ లో హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది.

హీరోయిన్ గా దిశా పటాని పేరు పరిశీలనలో ఉందని గతంలోనే ప్రచారం జరిగింది. ఇది దాదాపు ఓకే కావొచ్చని వినికిడి. రాధే శ్యామ్ ఎప్పుడు విడుదల అవుతుందనే దాన్ని బట్టి సలార్ రిలీజ్ ని ఫైనల్ చేయబోతున్నారు. ప్రభాస్ కాంపౌండ్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం 2021లోనే రాధే శ్యామ్, సలార్ ప్రేక్షకుల ముందుకు వస్తాయి. 2022లో ఆది పురుష్, 2023లో నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా ఉంటాయట. అయితే ఇవన్నీ ఇప్పుడు ప్లానింగ్ చేసుకున్న తరహాలో సాగితేనే సాధ్యమవుతుంది. లేదంటే బాహుబలి, సాహో తరహాలో మార్పులు చేర్పులు తప్పవు.