iDreamPost
iDreamPost
ఆర్టీసీ కార్మికు సంఘాలు బుధవారం సరూర్ నగర్ స్టేడియం లో నిర్వహించిన సకల జనభేరి విజయవంతమైంది. సకల జనభేరీ సభకు అన్ని జిల్లాల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు. సభ నిర్వహించిన స్టేడియం సామర్థ్యం చిన్నది కావటంతో జేఏసీ నేతలు జనసమీకరణకు పెద్దగా యత్నించలేదు. అయినా జిల్లాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో తరలివెళ్లారు. మిగిలినవారు ఆయా డిపోల ముందు నిరసనలు కొనసాగించారు. బుధవారంతో సమ్మె 26 రోజులు పూర్తి చేసుకుంది.
గురువారంతో తెలంగాణ సాధన కోసం జరిపిన సకల జనుల సమ్మె కాలంతో సమమవుతుంది. అదనంగా ఒక్కరోజు దాటినా తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘ సమ్మెగా రికార్డుల కెక్కనుంది. 2013లో జరిగిన సకల జనుల సమ్మె సమయంలో 27 రోజుల పాటు బస్సులు నిలిపేసి కార్మికులు సమ్మె చేశారు. ఇప్పుడు అంతకంటే దీర్ఘకాల సమ్మెగా అవతరించనుంది.