iDreamPost
android-app
ios-app

సైనా మూవీ రిపోర్ట్

  • Published Mar 28, 2021 | 9:51 AM Updated Updated Mar 28, 2021 | 9:51 AM
సైనా మూవీ రిపోర్ట్

మొన్న శుక్రవారం మన తెలుగు సినిమాల హడావిడిలో ఉండిపోయాం కానీ మరో బాలీవుడ్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే సైనా. ప్రముఖ బాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మీద పెద్ద అంచనాలు లేకపోయినా ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఓ వర్గం ప్రేక్షకులు ఆశించారు. అయితే వాటిని నీరుగారుస్తూ సైనాకు బాక్సాఫీస్ వద్ద పరాభవం తప్పలేదు. చప్పగా సాగే స్క్రీన్ ప్లే జనాన్ని మెప్పించలేకపోయింది. క్రిటిక్స్ సైతం గట్టిగానే క్లాసు తీసుకున్నారు. అసలు ఈ సబ్జెక్టుని తీసుకోవడమే రాంగ్ అంటూ తేల్చిసి రెండు లోపలే రేటింగ్ ఇవ్వడంతో ఫలితం ఏమైందో అర్థమైపోయింది.

ఇటీవలే ది గర్ల్ ఇన్ ది ట్రైన్ లో పెర్ఫార్మన్స్ తో మెప్పించిన పరిణితి చోప్రా ఇందులో సైనాగా ఏ మాత్రం సూట్ కాలేదు. పైగా సహజత్వం కోసమని మొహం మీద పుట్టుమచ్చతో సహా ప్రతిదీ ఆర్టిఫిషియల్ గా కనిపించింది. మంచి నటి అయిన పరిణితి సైతం దీన్ని మోయలేకపోయిందంటే దర్శకుడు ఎంత నీరసంగా దీన్ని రాసుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ కు ముందు వరకు ఏదో ధోని, సచిన్ రేంజ్ లో కొంత బిల్డప్ ఇచ్చి ప్రమోట్ చేశారు. అయితే ఆ ట్రిక్కులేవి పని చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే సైనా సినిమా పేరు ఘనం కంటెంట్ శూన్యం తరహాలో ఎవరినీ అంతగా మెప్పించలేకపోయింది.

ఎంత నిజ జీవిత కథలైనా వాటిలో డ్రామా ఉంటేనే జనం మెచ్చుతారు. ధోని మూవీకి దక్కిన ఆదరణ అజహర్ కు రాలేదు. సచిన్ సినిమా డాక్యూమెంటరీ  తరహాలో రూపొందటంతో మరీ అద్భుతాలు జరగలేదు. బాగ్ మిల్కా భాగ్ లో పండిన ఎమోషన్లు మేరీ కోమ్ లో ఆ స్థాయిలో కనిపించలేదు. అందుకే ఫలితాలు కూడా వేర్వేరుగా వచ్చాయి. కథల కొరతతో ఇటీవలి కాలంలో ఎక్కువగా స్పోర్ట్ మెన్ బయోపిక్ ల మీద దృష్టి పెడుతున్న దర్శకులు అందులో రెండు గంటలకు సరిపడేంత డ్రామా ఉందో లేదో చూసుకోవాలి. అంతే తప్ప పాపులర్ సెలబ్రిటీ అయినంత మాత్రాన పబ్లిక్ ఎగబడి చూస్తారన్న గ్యారెంటీ లేదు