iDreamPost
iDreamPost
ఏంటో ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే ప్రభాస్ 22 సినిమా తాలూకు అప్ డేట్స్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదిపురుష్’ లో విలన్ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ని అధికారికంగా ప్రకటిస్తూ ఇందాకా ప్రభాస్ స్వయంగా పోస్ట్ చేశాడు. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ విజువల్ వండర్ నాగ అశ్విన్ మూవీ కంటే ముందే పూర్తవుతుందని ముంబై టాక్. కానీ అధికారికంగా చెప్పేదాకా ఏదీ నమ్మలేం. ప్రభాస్ కు బాలీవుడ్ విలన్లతో చేయడం సాహోతోనే మొదలైపోయింది. కాకపోతే సైఫ్ లాంటి స్టార్ హీరోని ప్రతినాయకుడిగా ఫేస్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. పాత్ర పేరు లంకేష్ అని చెప్పేశారు కాబట్టి ఇది రావణాసురుడి క్యారెక్టర్ అనే క్లారిటీ అయితే వచ్చేసింది.
పది తలలతో సైఫ్ చూపించబోయే నట విశ్వరూపం కోసం ఫ్యాన్స్ అప్పుడే ఎదురు చూపులు మొదలుపెట్టారు. సైఫ్ ని తీసుకునే అవకాశాల గురించి గతంలోనే ఐడ్రీం మీ దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ తీసిన బ్లాక్ బస్టర్ తానాజీలో ప్రతినాయకుడిగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసిన సైఫ్ కంటే దర్శకుడికి వేరే ఛాయస్ కనిపించినట్టు లేదు. ఒకదశలో అజయ్ దేవగన్, అక్షయ్ పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా సైఫ్ నే లాక్ అయ్యాడు. లాక్ డౌన్ పూర్తిగా కనుమరుగయ్యాక దీనికి సంబంధించిన పనులు వేగవంతం చేయబోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ పూర్తి చేయాల్సి ఉంది. కీలకమైన యూరోప్ షెడ్యూల్ పెండింగ్ ఉంది.
అంతర్జాతీయ ప్రయాణాల మీద ఇంకా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాగ అశ్విన్ తో చేయాల్సిన సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడి ఉన్నది కావడంతో ఇంకా షూటింగులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. ముందుగా కదలిక వచ్చేది మాత్రం రాధే శ్యామ్ తోనే. ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఓ మూవీ చేయొచ్చని గత కొద్దిరోజులుగా గట్టి టాక్ వినిపిస్తోంది. ఇది కూడా నిజమైతే రానున్న ఐదేళ్ల కాలానికి డార్లింగ్ అఫీషియల్ గా లాక్ అయిపోయినట్టే. తనతో సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్న ఇతర దర్శకనిర్మాతలు లాంగ్ వెయిటింగ్ చేయక తప్పదు