iDreamPost
iDreamPost
2012లో రిలీజైన కృష్ణం వందే జగద్గురుమ్ లో మొదటిసారి అతని కలం బలం తెలిసొచ్చింది. మళ్ళీ మళ్ళీ రాని రోజులో సున్నితమైన భావోద్వేగాలను తన మాటలతో పలికించిన తీరు చూసి ఇంటర్ నెట్ జెనరేషన్ కూడా వహ్వా అన్నారు. 2015లో వచ్చిన కంచెతో ఇది కాస్తా పీక్స్ కు వెళ్లిపోయింది. పరిచయం అక్కర్లేని ఆ పేరు సాయి మాధవ్ బుర్ర. కోట్లాది రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా దానికి సంభాషణల కోసం మొదటి కాల్ ఈయనకే వెళ్తోంది. ఏవో కారణాల వల్ల కుదరదు అంటేనే వేరే వాళ్ళకు ఆ అవకాశం వెళ్తుంది. క్రాక్ లాంటి కమర్షియల్ మసాలా సినిమాకు సైతం సాయి మాధవ్ తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు మేకర్స్ కు.
ఇవాళ రామ్ చరణ్-శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మించబోయే భారీ సినిమాకు సైతం తననే ఎంపిక చేసుకోవడం పట్ల సాయి మాధవ్ బుర్ర వేసిన సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. 1994లో జెంటిల్ మెన్ చూసినప్పుడు శంకర్ తో ఫోటో దిగితే చాలనుకున్న స్టేజి నుంచి ఇప్పుడు ఏకంగా ఆయన సినిమాకు మాటలు రాయడం కన్నా అదృష్టం ఏముందని అందులో పేర్కొన్నారు. నిజమేకదా. ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, జంధ్యాల లాంటి రైటర్స్ ఎంజాయ్ చేసిన స్టార్ డం ని ఇప్పటి తరంలో సాయి మాధవ్ బుర్ర అందుకోవడం అతిశయోక్తి కాదు. రెమ్యునరేషన్ కూడా రెండు కోట్ల మార్క్ టచ్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్.
రచయితలు కరువవుతున్న టాలీవుడ్ లో సాయి మాధవ్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్, ఆకాశవాణి, శాకుతలంలతో పాటు ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ ప్రభాస్ – నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కూడా తన చేతిలోనే ఉంది. ఇంత బిజీగా ఉన్న సాయి మాధవ్ బుర్ర ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసినవాళ్ళే. ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో రచయిత ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయి మొత్తం డైరెక్టర్ వన్ మ్యాన్ షోగా మారుతున్న తరుణంలో ఇప్పుడిలా రైటర్ గొప్పదనం తెలిసేలాలా సాయి మాధవ్ చేస్తున్న అక్షర వ్యవసాయం వెండితెర మీద ఇంకెన్ని అద్భుతాలు సృష్టించనుందో