iDreamPost
iDreamPost
ఇటీవలే సెప్టెంబర్ 10న బైక్ యాక్సిడెంట్ కు గురై తీవ్ర ప్రమాద స్థితిలో చికిత్స తీసుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ సంపూర్ణంగా కోలుకున్నాడు. అపోలో ఆసుపత్రిలో ఉన్నంత కాలం అభిమానులు ఆందోళనకు గురవుతూనే ఉన్నారు. వెంటిలేటర్ మీద కొంత కాలం ఉన్న సాయి తేజ్ క్షేమం కోరుతూ కుటుంబ సభ్యులే కాదు యావత్ మెగా హీరోల అభిమానులు పూజలు ప్రార్ధనలు చేశారు. అవి ఫలించాయి. అక్టోబర్ 1 తన కొత్త సినిమా రిపబ్లిక్ రిలీజైనప్పుడు కూడా సాయి తేజ్ అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. అది అంచనాలను అందుకోలేకపోయినా తన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కొద్దిరోజుల క్రితం డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చిన తమ హీరోని చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇవాళ వాళ్ళ నిరీక్షణ ఫలించింది.
చిరంజీవి ట్వీట్ చేసిన ఫోటోతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.ఆయనతో పాటు సాయి తేజ్, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, అకీరానందన్ లు ఉన్న పిక్ కన్నుల పండుగలా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగబాబు, అకీరాలను మినహాయిస్తే మిగిలిన అందరి బాక్సాఫీస్ స్టామినా మొత్తం కలిపి 1000 కోట్ల పైమాటే లాంటి కామెంట్స్ నెటిజెన్లు పంచుకుంటున్నారు. ఫ్రేమ్ లో సాయి తేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు అర్థమవుతోంది. మాములుగా ఇలాంటి సందర్భాలకు అరుదుగా వచ్చే పవన్ కళ్యాణ్ మేనల్లుడి కోసం ఈ జ్ఞాపకంలో భాగం కావడం విశేషం. నీహారిక, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ లు ఇతర కారణాల వల్ల ఇందులో మిస్ అయ్యారు. మొత్తానికి సాయి తేజ్ క్షేమంగా ఉన్నాడన్న వార్త ఇండస్ట్రీలోనూ సంతోషాన్ని నింపుతోంది. ఈ పిక్ ని ట్వీట్ చేస్తూ పలువురు సెలెబ్రిటీలు తమ విషెస్ ని తెలియజేస్తున్నారు. సాయి తేజ్ కొత్త సినిమాల షూటింగ్ లో ఎప్పటి నుంచి పాల్గొంటారు, కమిట్ కాబోతున్న కొత్త చిత్రాల విశేషాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.