Idream media
Idream media
రాజస్థాన్‌లో రాజకీయాలు సరికొత్త దారిలో నడిచేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బíß షృత నేత, మాజీ డిప్యూటీ సీఎం, మాజీ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ తన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై స్పష్టత ఇచ్చారు. నిన్న తనపై కాంగ్రెస్ వేటు వేసిన నేపథ్యంలో పైలెట్ పయనం ఎలా సాగిస్తారన్న అంశంపై జోరుగా చర్చ సాగింది. ఆయన బీజేపీలోకి వెళతారనీ, కొత్త పార్టీ పెడతారని ఊహాగానాలు వెలువడ్డాయి. బీజేపీ నేతలు కూడా సచిన్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. బీజేపీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు ఓం మధుర్ సచిన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెర పడేలా.. సచిన్ ఈ రోజు ఓ ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరడంలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను తీవ్రంగా కృష్టి చేసినట్లు సచిన్ పేర్కొన్నారు.
కాగా, సచిన్‌తోపాటు ఆయన వర్గంలోని మరో ఇద్దరిపై వేటు వేసిన కాంగ్రెస్.. ఆ ముగ్గురి స్థానంలో కొత్త మంత్రులను తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. వారి ముగ్గురిని మంత్రివర్గం నుంచి తొలగించిన విషయం ఇప్పటికే సీఎం అశోక్ గెహ్లాత్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్ర దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సిఫార్సులకు గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ఎంపికపై సీఎల్పీ చర్చలు జరుపుతోంది. అదే సమయంలో సచిన్ పైలెట్ వర్గంలోని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కూడా అశోక్ గెహ్లాత్ వర్గం వ్యూహాలు రచిస్తోంది.
మరో వైపు బీజేపీ కూడా తాజా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతోంది. అవకాశం ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆ పార్టీ నేతల ప్రకటనల ద్వారా అర్థం అవుతోంది. రాజస్థాన్‌లో తమ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తే.. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. వంసుధర రాజే కన్నా గజేంద్ర షెకావత్ అందరికీ ఆమోదయోగ్యమైన నేత అని పేర్కొంటున్నారు. మరో వైపు వసుంధర రాజే ఈ రోజు బీజేపీ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితులపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించేందుకు సిద్దమవుతున్నారు.