ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం కార్మిక సంఘాలు, సంస్థ యాజమాన్యం తమ తమ వాదనలు వినిపించాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కార్మిక సంఘాలతో శనివారం జరిగిన చర్చల పై ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. కోర్టు ఆదేశాల మేరకు 21 అంశాల పై చర్చకు కార్మిక సంఘాలు అంగీకరించలేదని వివరించింది.
విలీనం తప్పా మిగిలిన డిమాండ్లు పై ఇరు పక్షాల మధ్య కేవలం భేదప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. విలీనం విషయం మినహా మిగతా డిమాండ్ల పై చర్చలు జరపాలని తాము పేర్కొన్నామని తెలిపింది. అన్ని సమస్యలు రాత్రికి రాత్రే పరిస్కారం కావని వ్యాఖ్యానించింది. సమ్మె వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించాలని కార్మిక సంఘాలకు చూచిందింది.