Idream media
Idream media
ఆర్టీసీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యం లో సంస్థ కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా గురువారం రాత్రి మరో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటు తో మరణించారు. నార్కట్ పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ జమీల్‌కు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమ్మెపై ప్రభుత్వ తీరుతో మానసిక ఒత్తిడికి గురయ్యాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె పై కార్మిక సంఘాలు, తెలంగాణ ప్రభుత్వం మెట్టు దిగని నేపథ్యంలో సమస్య రోజు రోజుకి జటిలం అవుతోంది.