iDreamPost
android-app
ios-app

చర్చలు జరిపితేనే అంత్యక్రియలు

  • Published Oct 31, 2019 | 12:53 PM Updated Updated Oct 31, 2019 | 12:53 PM
చర్చలు జరిపితేనే అంత్యక్రియలు

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం బుధవారం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్‌ నంగునూరి బాబు అంత్యక్రియలపై ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని గురువారం మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. మృతుడి ఇంటివద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడంతో.. జిల్లాలోని ఆరెపల్లి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

మృతుని కుటుంబ సభ్యులను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించించారు. అరెస్ట్‌ చేసిన జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపేవరకూ.. మృతదేహాన్ని కదలనివ్వబోమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు.