iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ సమ్మె- అద్దె బస్సుల కోసం మళ్ళి నోటిఫికేషన్

ఆర్టీసీ సమ్మె- అద్దె బస్సుల కోసం మళ్ళి నోటిఫికేషన్

ఒకవైపు కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు కొనసాగిస్తోంది. ఆర్టీసీలో కొత్తగా అద్దె బస్సులు తీసుకునేందుకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఇటీవల అద్దె బస్సుల టెండర్ల విషయంలో కార్మికులు ఆందో ళన వ్యక్తం చేసినా, మొదటి దఫా ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండానే మరో దఫా టెండర్లకు సిద్ధం కావడం గమనార్హం. 

సమ్మె సమయంలోనే మరోసారి అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ విడతలో పెద్ద ఎత్తున బస్సులను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తిగల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆదిలాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూర్‌ డిపోల నుంచి వివిధ రూట్లలో బస్సులను నడిపేందుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియకు శనివారం చివరి రోజు. సాయంత్రమే వీటికి సంబంధించి టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.