Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడకు బాలినేని బయలుదేరారు. విజయవాడ ఎగ్జిట్ వద్ద బాలినేని కాన్వాయ్‌లోని ఒక వాహన అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు. మంత్రి బాలినేని సురక్షితంగా ఉన్నారు.