iDreamPost
android-app
ios-app

శాంతిస్తున్న గోదావరి

  • Published Aug 24, 2020 | 2:55 PM Updated Updated Aug 24, 2020 | 2:55 PM
శాంతిస్తున్న గోదావరి

ఉగ్రరూపంతో హడలెత్తించిన గోదావరి శాంతిస్తోంది. నీటి మట్టంలో గణనీయంగా తగ్గుదల ఆదివారం నుంచి ప్రారంభమై సోమవారం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. నాలుగు గంటల వ్యవధిలోనే దాదాపు డెబ్బైవేల క్యూసెక్కులకు పైగా నీటి విడుదల తగ్గిందని అధికారుల బులిటెన్‌లో తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం 1 గంట సయంలో 14.80 అడుగుల నీటిమట్టంతో 14,80,127 క్యూసెక్కుల మిగులు జలాలను క్రిందికి విడిచిపెట్టారు. రాత్రి 8 గంటల సమయానికి 13.80 అడుగుల నీటిమట్టం వద్ద 
175 గేట్లు తెరిచి 12,97,053 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ధవళేశ్వరంలో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద కూడా 38.80 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని పరిస్థితుల దృష్ఠ్యా వరద మరింతగా తగ్గుతుందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నది దిగువ భాగంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కాగా కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 17.76 మీటర్లు, శబరి నది కుంట వద్ద 9.39 మీటర్లు, తాళ్ళగూడెం వద్ద 11.10 మీటర్ల నీటి మట్టం నమోదైంది.