iDreamPost
android-app
ios-app

ఏడేళ్ల తర్వాత హారర్ సినిమాకు మోక్షం

  • Published Apr 07, 2021 | 5:01 AM Updated Updated Apr 07, 2021 | 5:01 AM
ఏడేళ్ల తర్వాత హారర్ సినిమాకు మోక్షం

అప్పుడెప్పుడో ప్రకటించి షూటింగ్ చేసి టీజర్ రిలీజ్ అయ్యాక ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ సినిమా ‘పట్టపగలు’ పేరు మార్చుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘దెయ్యం’గా ఈ నెల 16న లవ్ స్టోరీకి పోటీగా దించబోతున్నారు. ఇందులో యాంగ్రీ మెన్ రాజశేఖర్ హీరో కాగా బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ కీలక పాత్రలో నటించింది. దృశ్యం తరహాలో ఇందులో రాజశేఖర్ వయసొచ్చిన కూతురికి తండ్రిగా నటించారు. దెయ్యాలు రాత్రిళ్ళు మాత్రమే కాదు పగలు కూడా వస్తాయనే కాన్సెప్ట్ తో దీన్ని రూపొందించారు. అసలు అప్పట్లో ఇది ఎందుకు ఆగిపోయిందో దానికి కారణాలు ఏమిటో ఏనాడూ బయటికి రాలేదు.

దెయ్యం పేరుతో వర్మ ఆల్రెడీ ఓ సినిమా తీశారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం 1996లో జెడి చక్రవర్తి మహేశ్వరి కాంబినేషన్ లో ఈ మూవీ వచ్చింది. పెద్దగా ఆడలేదు కానీ ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులను బాగానే మెప్పించింది. సీనియర్ నటి జయసుధ గారు ఇందులో దెయ్యంగా నటించడం ఆ టైంలో సెన్సేషన్. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్ ని వాడుకోవడం విచిత్రమే. ఇప్పటికే హారర్ జానర్ లో లెక్కలేనన్ని సినిమాలు తీసిన వర్మ ఇప్పుడీ దెయ్యంలో ఏం చూపిస్తారని ఆశించడం అత్యాశే. ఇంత గ్యాప్ తర్వాత వస్తుందంటేనే ఎన్నో అనుమానాలు తలెత్తుతాయి.

కాకపోతే రాజశేఖర్ ఫ్యాన్స్ కి కొంత ఊరట. తమ హీరోని మళ్ళీ తెరమీద చూసుకోవచ్చు. ఇక వర్మ విషయానికి వస్తే గత కొన్నేళ్లలో ఏ సినిమా విజయం సాధించకపోయినా వరస దండయాత్రలు మాత్రం ఆపడం లేదు. లాక్ డౌన్ టైంలో ఏటిటి ద్వారా బాగానే వర్కౌట్ చేసుకున్న వర్మ కరోనా వైరస్ సినిమా తర్వాత ఎందుకనో సైలెంట్ గా ఉన్నారు. దెయ్యం తరహాలోనే ఎప్పుడో పూర్తయిపోయిన ఓ హిందీ మూవీని ఆ మధ్య రిలీజ్ చేశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. వకీల్ సాబ్ వచ్చిన వారానికి, లవ్ స్టోరీ మీద భారీ బజ్ ఉన్న నేపథ్యంలో అదే రోజు రిలీజ్ కాబోతున్న దెయ్యం వాటి తాకిడిని తట్టుకోగలదా