iDreamPost
android-app
ios-app

రామసేతు వయసుపై పరిశోధన-తొలిసారి రంగంలోకి భారత్ !!

రామసేతు వయసుపై పరిశోధన-తొలిసారి రంగంలోకి భారత్ !!

రామసేతు చరిత్ర గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మంచు యుగంలో భారత్, శ్రీలంకలను కలుపుతూ భూభాగం ఉండేదనేది ఓ వాదన. శ్రీలంక కూడా భారత ప్రధాన భూభాగంలో భాగమని, 1.25 లక్షల ఏళ్ల క్రితం విడివడిందనేది మరో వాదన. హిందువులు మాత్రం.. రావణుడు సీతను అపహరించడంతో.. ఆమెను వెనక్కి తీసుకు రావడానికి రాముడు సేతును నిర్మించాడని బలంగా నమ్ముతారు.

భారత్, శ్రీలంక మధ్య ఉన్న రామసేతు గురించి మరోసారి చర్చ మొదలైంది. వానరులతో కలసి శ్రీరాముడు దీన్ని నిర్మించారని హిందువులు విశ్వసిస్తారనే సంగతి తెలిసిందే. మెజార్టీ భారతీయుల వాదనకు బలం చేకూర్చేలా.. రామసేతు మానవ నిర్మితమా..లేక సహజ సిద్ధమా అనే వాదనలకు తెదించుతూ..ఇది మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానెల్ గతంలో తెలిపింది. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, అక్కడి రాళ్లు ఎవరో పేర్చినట్లుగా ఉన్నాయని ఆ ఛానెల్ పేర్కొంది.

మరోవైపు.. భారత్, శ్రీలంకలను కలుపుతున్నట్టుగా ఉండే రామసేతు నిజంగా ఓ అద్భుతం. తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక మన్నార్ వరకు ఇది విస్తరించి ఉంటుంది. ఈ వారధి మీదుగానే రాముడు తన సైన్యంతో లంకను ముట్టడించినట్టు రామాయణంలో పేర్కొన్నారు. మరెక్కడా లేని విధంగా ఇసుక, సున్నపురాళ్ల మిశ్రమంతో కూడిన రాళ్లు ఈ సేతువు ఆసాంతం కనిపిస్తాయి. దాదాపు 30 కిలోమీటర్ల పొడవుండే రామసేతు ఎప్పుడు ఏర్పడిందన్నదానిపై అనేక రకాల వాదనలున్నాయి.

రామసేతు అనే బ్రిడ్జ్ భారత్, శ్రీలంక మధ్య లేదని 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. రాముడు వంతెన నిర్మిస్తే.. దాన్ని తప్పకుండా కూల్చేసి ఉంటాడని స్పష్టం చేసింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలని యూపీఏ సర్కారు భావించింది. తద్వారా శ్రీలంకను చుట్టి వచ్చే అవసరం తప్పడంతోపాటు.. ప్రయాణ సమయం, ధనం ఆదా అవుతాయని భావించింది.

ఇది ప్రకృతిసిద్ధంగా ఏర్పడిందన్న అభిప్రాయాలు కూడా కాస్త బలంగానే వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఆడమ్స్ బ్రిడ్జిగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వారధి వయసెంతో తెలుసుకునేందుకు సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) నిర్ణయించింది.ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనలకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు చెందిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఆర్కియాలజీ ఆమోదం తెలిపింది. పురాతన వస్తువులు, రేడియో మెట్రిక్, పదార్థాల ఉష్ణోగ్రత, కాంతి పరిశీలన, పర్యావరణ సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేపడుతున్నట్టు ఎన్ఐఓకు చెందిన ప్రొఫెసర్ సునీల్ కుమార్ సింగ్ వెల్లడించారు.

సో..హిందువులు విశ్వాసమైన, ఆడమ్స్ బ్రిడ్జిగా ప్రాచుర్యంలో ఉన్న రామసేతు..వయసెంతో త్వరలో తేలిపోనుంది..దీని ఆధారంగా అయినా అది రామాయణ కాలం నాటిదని తేలిపోనుంది. ఎందుకంటే రామాయణంలో ఖగోళ శాస్త్రం ఉంది.. సహస్రయోజన పరభానూ అంటు హనుమాన్ చాలిసాలో చెప్పింట్లు సూర్యునికి భూమికి మద్య దూరం సాంకేతికంగా రమారమి అంతే అని తేలింది. అలాగే రామాయణంలో చెప్పిన భౌగోళిక స్వరూపం దాదాపు అలానే ఉంది. సో హిందువులవిశ్వాసాల ప్రకారం రామసేతు వయసు,రామాయణ కాలం నాటి వయస్సుతో సరిపోలుతుందిన్న విశ్వాసం అంతే.

తమిళనాడులోని పంబన్ దీవి, శ్రీలంకలోని మన్నార్ దీవి మధ్య రామ సేతు ఉంది. దీన్నే ఆడమ్ బ్రిడ్జిగానూ వ్యవహరిస్తుంటారు. ఇక్కడ సహజంగా ఏర్పడిన ఇసుక 4 వేల ఏళ్ల నాటిది. కాగా, ఏడు వేళ్ల ఏళ్ల క్రితం ఏర్పడిన రాళ్లను వేరే చోటు నుంచి ఇక్కడికి తరలించారని సైన్స్ ఛానెల్ స్పష్టం చేసింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో 30 కి.మీ.కి పైగా దూరాన్ని సున్నపు రాళ్లతో వంతెనలా అనుసంధానించినట్లు గతంలో ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని వెలువరించింది.