iDreamPost
android-app
ios-app

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య కేసులో విచారణ నిమిత్తం ఆర్నాబ్ గోస్వామిని  ఐపిసి సెక్షన్ 306, సెక్షన్ 34 కింద అర్నాబ్‌ను అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే వెల్లడించారు.అర్నాబ్ గోస్వామిని ప్రస్తుతం రాయ్‌గడ్‌కు తీసుకువెళుతున్నారని కొంకణ్ రేంజ్ ఐజి సంజయ్ మోహితే తెలిపారు.

పోలీసులు ఆర్నాబ్ గోస్వామిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో తనపై దాడి చేసారని ఆర్నాబ్ గోస్వామి ఆరోపించారు. తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి తనపై శారీరక దాడి చేయడమే కాకుండా వ్యాన్ లోకి నెట్టి వేశారని ఆర్నాబ్ గోస్వామి ఆరోపించారు. పోలీసులు ఆర్నాబ్ గోస్వామిని ఆదువుకోకి తీసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఆర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి?

2018 లో 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అన్వయ్ నాయక్ తాము ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఒక లేఖలో వివరించారు.ఆ లేఖలో ఆర్నాబ్ గోస్వామితో పాటు  మరో ఇద్దరు ఫిరోజ్ షేక్ మరియు నితీష్ సర్దా తనకు చెల్లించాల్సిన 5.40 కోట్ల రూపాయలన చెల్లించలేదని అందుకే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామని వెల్లడించారు. దీంతో అన్వయ్ నాయక్ భార్య అక్షతా అర్నాబ్ గోస్వామిపై ఫిర్యాదు చేసింది. 2018లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2019లో కేసును మూసివేశారు.

కాగా 2020 లోఅన్వయ్ నాయక్ కుమార్తె అద్న్య నాయక్ అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ నుండి తన తండ్రికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంపై అలీబాగ్ పోలీసులు దర్యాప్తు చేయలేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కి పిర్యాదు చేయడంతో ఆయన తాజాగా సిఐడి దర్యాప్తుకు ప్రకటించారు. దాంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

అర్నాబ్ గోస్వామిపై గతంలోనూ రెండు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కించపరిచారని, పాల్ఘర్ దాడి ఘటన, బాంద్రా స్టేషనులో జనం మోహరించిన ఘటనలపై ముంబై పోలీసు స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని, పరువునష్టం, ఉద్రిక్తతలు రేపేందుకు యత్నించారని అర్నాబ్ పై కేసులున్నాయి.

కాగా అర్నాబ్ గోస్వామి అరెస్టును కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. అత్యవసర రోజులను ఇది గుర్తుచేస్తుందని ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆర్నాబ్ అరెస్టును ఖండించారు.