కేవలం థియేట్రికల్ రిలీజ్ కోసమే ఏడాది పాటు వేచి చూసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా రెడ్ ఎట్టకేలకు ఆశించిన ఫలితాన్ని వసూళ్ల రూపంలో దక్కించుకుంది. ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో సగం కూడా కాదు కానీ వచ్చిన డివైడ్ టాక్ తో పోల్చుకుంటే ఇవి చాలా మంచి ఫిగర్స్ అని చెప్పొచ్చు. తమిళ బ్లాక్ బస్టర్ తడం రీమేక్ గా రూపొందిన రెడ్ నిజానికి ఒరిజినల్ మేజిక్ ని రీ క్రియేట్ చేయడంలో సఫలం కాలేకపోయింది. కానీ సంక్రాంతి సీజన్ బాగా కలిసి వచ్చి సొమ్ములు చేసుకుంది. అందులోనూ లాక్ డౌన్ తర్వాత సుదీర్ఘ విరామంతో థియేటర్లు తెరుచుకున్నాక వచ్చిన సినిమా కావడంతో లెక్కలు బాగా అందాయి.
బిజినెస్ కోణంలో చూసుకుంటే రెడ్ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలే వచ్చాయి. కాకపోతే రామ్ మునుపటి రేంజ్ సక్సెస్ ఆశించారు కానీ క్రాక్ తో పోటీ వల్ల అది సాధ్యపడలేదు. 20 కోట్ల షేర్ కు అతి దగ్గరలో ఆగిపోయిన రెడ్ మూడో వారం ప్రారంభంలోనే నెమ్మదించింది. కంటెంట్ కొంచెం వీక్ గా ఉండటంతో గ్రాఫ్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. అయినప్పటికీ రామ్ డ్యూయల్ రోల్ మొదటిసారి చేయడం, క్రైమ్ థ్రిల్లర్ అనే ప్రచారం జరగడం రెడ్ కు కలిసి వచ్చాయి. పండగ సినిమాల్లో చూసుకుంటే రెడ్ రెండో స్థానాన్ని దక్కించుకోవడం శుభ పరిణామమే. ఇక ఏరియాల వారీగా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి
రెడ్ ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా | షేర్ |
నైజాం | 6.45cr |
సీడెడ్ | 3.24cr |
ఉత్తరాంధ్ర | 2.15cr |
గుంటూరు | 1.30cr |
క్రిష్ణ | 1.23cr |
ఈస్ట్ గోదావరి | 1.62cr |
వెస్ట్ గోదావరి | 0.61cr |
నెల్లూరు | 0.97cr |
ఆంధ్ర+తెలంగాణా | 18.54cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.85cr |
ఓవర్సీస్ | 0.40cr |
ప్రపంచవ్యాప్తంగా | 19.79cr |
నల్ రన్ పూర్తయ్యింది కాబట్టి ప్రధాన సెంటర్లలో రెడ్ కొనసాగుతున్నప్పటికీ వస్తున్న కలెక్షన్లు నామమాత్రమే. పైగా ఆ తర్వాత కొత్త రిలీజులు వచ్చాయి కాబట్టి ఎక్కువ ఆశించడానికి లేదు. త్వరలోనే సన్ నెక్స్ట్ ఓటిటి యాప్ లో స్ట్రీమింగ్ కాబోతున్న రెడ్ అభిమానులను బాగానే సంతృప్తి పరిచినప్పటికీ సగటు ఆడియన్స్ ని మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన రెడ్ లో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటించగా హెబ్బా పటేల్ ఐటెం సాంగ్ లో కనిపించింది. మణిశర్మ సంగీతం సమకూర్చారు
Verdict – HIT