iDreamPost
android-app
ios-app

రెడ్ VS క్రాక్ : క్లాష్ అఫ్ టైటాన్స్

  • Published Dec 27, 2020 | 6:21 AM Updated Updated Dec 27, 2020 | 6:21 AM
రెడ్ VS క్రాక్ : క్లాష్ అఫ్ టైటాన్స్

సంక్రాంతికి ఇంకా ఇరవై రోజులు కూడా లేని తరుణంలో అప్పుడే పందెం వేడి రాజుకుంటోంది. టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి అతి కీలకమైన సీజన్ గా మారిన భోగి పండగకు మొదటిసారి వంద కోట్ల హీరోలెవరూ బరిలో లేరు. అందరివి షూటింగ్ దశలో ఉండటంతో ఎవరూ వేగంగా పూర్తి చేసే అవకాశం లేకపోయింది. ఒకవేళ కరోనా రాకపోయి ఉంటే ఏకంగా ఆర్ఆర్ఆర్ ఊచకోత కళ్లారా చూసే అవకాశం దక్కేది. దీని సంగతలా ఉంచితే వస్తున్నవి మీడియం అండ్ హై బడ్జెట్ సినిమాలే అయినప్పటికీ క్రేజ్ విషయంలో దేనికవే సంథింగ్ స్పెషల్ అనే తరహాలో ఫుల్ గా ప్రమోషన్ చేసుకుంటున్నాయి. బిజినెస్ ఆఫర్స్ కూడా అలాగే ఉన్నాయి.

ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ క్రాక్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ రెండూ ఒక తేదీ జనవరి 14న క్లాష్ కానుండటం హాట్ టాపిక్ గా మారింది. రామ్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించాడు. గతంలో ఇతని డెబ్యూ మూవీ దేవదాస్ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇదే సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. క్రాక్ కి సంబంధించిన డేట్ ని తమన్, గోపి చంద్ చెప్పారు కానీ యూనిట్ నుంచి, రవితేజ వైపు నుంచి ఇంకా అధికారిక సమాచారం లేదు. ప్రాథమికంగా 14 అనుకున్న మాట వాస్తవం. సో ఇందులో మార్పు ఉండే అవకాశాలు లేకపోలేదు కానీ వేచి చూడాలి.

అసలే 50 శాతం ఆక్యుపెన్సీతో టికెట్ ధరలు పెంచకుండా కలెక్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో థియేటర్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. సోలో బ్రతుకే సో బెటరూ ఓపెనింగ్ బాగున్నప్పటికీ వీక్ డేస్ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రెడ్, క్రాక్ ఒకే రోజు రావడమన్నది అంత మంచి పరిణామం కాదని పరిశీలకుల అభిప్రాయం. ఇందులో ఒకటి 10 నుంచి 13 మధ్యలో వస్తే శ్రేయస్కరంగా ఉంటుందన్నది వాళ్ళ వెర్షన్. ఎందుకంటే మరోవైపు విజయ్ మాస్టర్ కూడా బరిలో ఉంది. స్ట్రెయిట్ సినిమా అంత రేంజ్ లేకపోయినా కంటెంట్ బాగుంటే గట్టి పోటీ ఇస్తాడు. మరి రెడ్, క్రాక్ లలో ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి.