ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ దర్శకత్వంలో తన పదిహేనో సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యువి బ్యానర్ నిర్మాణంలో దీని తాలూకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా గతంలోనే వచ్చింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇది క్యాన్సిల్ అయ్యిందట. గౌతమ్ చెప్పిన స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ పూర్తి సంతృప్తి నివ్వకపోవడంతో పాటు ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న కారణంగా మాస్ కి రీచ్ అవ్వదనే ఉద్దేశంతో నో చెప్పారని వినికిడి. ఇదీ అధికారికంగా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ నుంచి వినిపిస్తున్న బలమైన న్యూస్ ఇది. గౌతమ్ స్థానంలో ఎవరొస్తారో చూడాలి.
ఎప్పుడో వెనుకబడి ఇండస్ట్రీకి దూరమైన సుమంత్ కి మళ్ళీ రావాతో బ్రేక్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరికి డెబ్యూనే చాలా పేరు తీసుకొచ్చింది. నాని జెర్సీలోని భావోద్వేగాలకు ఫ్యామిలీ ఆడియన్స్ కదిలిపోయారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఏమంత కమర్షియల్ ఫలితాలు ఇవ్వలేకపోయింది. అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఇది హిందీలో అయితే ఇంకా బాగా ఆడుతుందనే అతి నమ్మకంతో అల్లు అరవింద్,దిల్ రాజు,నాగ వంశీలు కలిసి భారీ బడ్జెట్ తో గౌతమ్ తోనే షాహిద్ కపూర్ ని పెట్టి రీమేక్ చేశారు. ఊహించని స్థాయిలో దారుణంగా డిజాస్టర్ అయ్యింది. కబీర్ సింగ్ రేంజ్ లో ఆడుతుందని ఆశలు పెట్టుకున్న షాహిద్ కలలు కల్లలే అయ్యాయి.
అందుకే రామ్ చరణ్ ది ఎలా డీల్ చేస్తాడోననే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. ఒకవేళ నిజంగా క్యాన్సిల్ అయ్యుంటే మంచిదే అనుకోవాలి. ఎందుకంటే చరణ్ రేంజ్ ఇమేజ్ మార్కెట్ ఉన్న స్టార్లను డీల్ చేయడం అంత సులభం కాదు. గతంలో రన్ రాజా రన్ తర్వాత దర్శకుడు సుజీత్ మూడు వందల కోట్లతో తీసిన సాహో ఏమయ్యిందో చూసాం. గోపిచంద్ జిల్ ని బాగా డీల్ చేశాడన్న నమ్మకంతో ప్రభాస్ రాధాకృష్ణకు రాధే శ్యామ్ ఆఫర్ చేస్తే దాని తాలూకు పీడకలలు ఫ్యాన్స్ ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏడాదికి ఒకటి చేయడమే కష్టంగా ఉన్న చరణ్ లాంటి హీరోలు రిస్క్ చేసేందుకు రెడీ లేరు. అదే కారణమేమో
టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత మల్టీ స్టారర్ల ట్రెండ్ ఊపందుకుంది. దానికి వచ్చిన వరల్డ్ వైడ్ రెస్పాన్స్ చూసి సరైన కథ దర్శకుడు పడితే ఏ రేంజ్ లో సంచలనాలు చేయొచ్చో ఇండస్ట్రీ గమనిస్తోంది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రవితేజల కాంబో ఎంత ప్లస్ అయ్యిందో చూస్తున్నాం. తాజాగా అలాంటి మరో కలయిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆ వివరాలేంటో చూద్దాం. సీతారామంతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి […]