దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ కరోనా రికవరీ రేట్ పెరగడం ఆనందం కలిగించే విషయంగా చెప్పొచ్చు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ అని తేలిందని ట్విట్టర్ ద్వారా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిపారు. కాగా ఇటీవల తనను కలిసిన వారు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా తాను కరోనా బారిన పడినప్పటికీ ఆర్‌బీఐ యథావిధిగా పనిచేస్తుందని, వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ల ద్వారా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ వెల్లడించారు.