iDreamPost
android-app
ios-app

రామారావు సౌండ్ పెంచాలి

  • Published Jul 09, 2022 | 5:52 PM Updated Updated Jul 09, 2022 | 5:52 PM
రామారావు సౌండ్ పెంచాలి

గత ఏడాది క్రాక్ రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుని తన కంబ్యాక్ ని మరోసారి బలంగా అందుకున్న మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఈ నెల 29న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి బోలెడు అడ్డంకులు, అవాంతరాలు, రకరకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా మూడు డేట్లు మారి ఫైనల్ గా సెట్ చేసుకుంది.

అంతా బాగానే ఉంది కానీ రామారావుకు ఉండాల్సినంత బజ్ అటు ట్రేడ్ లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ కనిపించడం లేదు. ఖిలాడీ డిజాస్టర్ తాలూకు ప్రభావమా అంటే అదీ అనిపించడం లేదు. యూనిట్ ఈ మధ్య కొన్ని అప్ డేట్స్ ఇస్తోంది కానీ అవేవీ ఫ్యాన్స్ కి పెద్ద కిక్ ఇచ్చేలా లేవు. నా పేరు సీసా అంటూ వదిలిన ఐటెం సాంగ్ ఆన్లైన్ లో బాగానే వెళ్ళింది కానీ హైప్ కి అదొక్కటే సరిపోదు.

శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న రామారావు ఆన్ డ్యూటీకి సామ్ సి ఎస్ సంగీతం సమకూర్చారు. దివ్యంష కౌశిక్, రజిషా హీరోయిన్లుగా నటించారు. ఈ అంశాలేవీ బజ్ తీసుకురావడం లేదు. పబ్లిక్ లో నెగటివ్ ఒపీనియన్ రాకముందే టీమ్ జాగ్రత్త పడి ప్రమోషన్ వేగం పెంచాలి. లేదంటే చేతిలో మంచి మాస్ కంటెంట్ ఉన్న సినిమా ఉన్నా కూడా క్యాష్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş