iDreamPost
android-app
ios-app

రామారావుతో గాడ్సే ఢీ

  • Published May 18, 2022 | 5:39 PM Updated Updated May 18, 2022 | 5:39 PM
రామారావుతో గాడ్సే ఢీ

ఎంత ప్లాన్డ్ గా చేసుకున్నా పరిస్థితులు నిర్మాతలను బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధపడేలా చేస్తున్నాయి. తాజాగా సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సేని జూన్ 17న విడుదల చేయబోతున్నట్టు ఇందాక అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు గోపి గణేష్. గతంలో వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లఫ్ మాస్టర్ బ్లాక్ బస్టర్ కాదు కానీ మంచి ప్రశంసలే దక్కాయి. అందుకే ఈ కాంబో మీద చెప్పుకోదగ్గ అంచనాలు ఏర్పడ్డాయి. సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించినట్టు టీజర్ చూశాక అర్థమయ్యింది. ముందు మే 20 రిలీజ్ అనుకున్నారు కానీ సర్కారు వారి పాటను చూసో లేక ప్రమోషన్ కు టైం లేదనో మొత్తానికి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు

అలా అని గాడ్సేకు సోలో డేట్ దక్కలేదు. అదే రోజు మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. శరత్ మండవ దర్శకత్వంలో రెవిన్యూ ఆఫీసర్ గా కొత్త పాత్రలో కనిపిస్తుండగా అభిమానులకు దీని మీద గట్టి ఆశలే ఉన్నాయి. ఖిలాడీ తాలూకు డిజాస్టర్ గాయాన్ని ఇది పూర్తిగా మాన్పుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరి దీంతో నేరుగా గాడ్సే పోటీకి సిద్ధపడటం అంటే రిస్క్ లేకపోలేదు. ఎందుకంటే ఆ నెలలో చాలా టైట్ కాంపిటీషన్ ఉంది. 10న నాని అంటే సుందరానికి వస్తోంది. అదే రోజు ప్యాన్ ఇండియా మూవీ 777 ఛార్లీ రేస్ లో ఉంది. దానికి వారం ముందు మేజర్, విక్రమ్, పృథ్విరాజ్ లు ఉన్నాయి.

సో ఇవన్నీ చెక్ చేసుకుని గాడ్సే అనౌన్స్ చేశారేమో తెలియదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఆపేకొద్దీ ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాలకు పెట్టుబడులు భారంగా మారతాయి. నిజంగా కంటెంట్ బాగుంటే ఎంత పోటీ ఉన్నా సరే సినిమా ఆడుతుంది. దీని తర్వాత సత్యదేవ్ తమన్నాల గుర్తుందా శీతాకాలం రెడీ అవుతుంది. చిరంజీవి గాడ్ ఫాదర్ లోనూ తను ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. సో 2022 సత్యదేవ్ కు స్పెషల్ గా నిలవబోతోంది. రామారావు ఆన్ డ్యూటీ పనులు ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదనే సంకేతం నిన్న యూనిట్ కొత్త పోస్టర్ రూపంలో ఇచ్చింది. సో లెట్ వెయిట్ అండ్ సి

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş