iDreamPost
iDreamPost
ప్రస్తుతం శ్రీకారం పూర్తి చేసే పనుల్లో ఉన్న శర్వానంద్ తర్వాత మహాసముద్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ నటిస్తున్న ఈ సినిమాకు ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా శర్వా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు టైటిల్ తో రూపొందబోయే ఈ మూవీకి కిషోర్ తిరుమల డైరెక్టర్. స్క్రిప్ట్ ఎప్పుడో లాకైపోయింది. రేపు పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తారు. తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న ఎంపికైనట్టుగా తెలిసింది.
ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పుష్ప మాత్రం రష్మిక చేతుల్లో ఉంది. తమిళ్ లో కార్తీతో చేసిన సుల్తాన్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అందుకే శర్వా చిత్రానికి డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం. తనను చిరంజీవి వేదాళం రీమేక్ లో చెల్లి పాత్రకు అడిగారని టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత అది పుకారని తేలిపోయింది. ఆచార్యలో రామ్ చరణ్ సరసన జోడిగా కనిపించేది ఖాయమని టాక్ వచ్చింది కానీ దీన్ని సమర్ధిస్తూ ఖండిస్తూ రష్మిక నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది షూట్ మొదలయ్యాకే క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన రష్మిక డిమాండ్ మాములుగా లేదు
ఇక ఆడవాళ్ళూ మీకు జోహార్లు విషయానికి వస్తే ఇదే కథని తిరుమల కిషోర్ గతంలో వెంకటేష్ తో చేసే ప్రయత్నాలు చేశాడు. నిత్య మీనన్ ని హీరోయిన్ గా కూడా అనుకున్నారు. అది కుదరకపోవడంతో రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ చేసి ఆశించిన ఫలితం అందుకోలేదు. సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో సక్సెస్ బాటలో పడ్డారు. తాజాగా రెడ్ విడుదల లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ నుంచి వాయిదా పడుతూ వస్తోంది. అప్పటి నుంచే కిషోర్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు సమాచారం. శర్వానంద్ కూడా వరస ప్రయోగాలతో హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్న నేపథ్యంలో ఇకపై పూర్తిగా ఎంటర్ టైనర్స్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడట.