iDreamPost
android-app
ios-app

బిగ్ బి సినిమాలో బంపర్ ఆఫర్

  • Published Dec 28, 2020 | 10:09 AM Updated Updated Dec 28, 2020 | 10:09 AM
బిగ్ బి సినిమాలో బంపర్ ఆఫర్

సౌత్ లో ఎంత డిమాండ్ ఉన్నా రష్మిక మందన్న చూపు బాలీవుడ్ మీద గట్టిగానే ఉంది. క్రేజీ ఆఫర్లు వెంటపడుతున్నా సరే అక్కడ ఛాన్స్ వస్తే మాత్రం వదలడం లేదు. ఇప్పటికే మిషన్ మజ్ను అధికారికంగా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ని కూడా ఓకే చేసినట్టు ముంబై టాక్. అది కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సరసన కూతురిగా అంటే మాటలా. వికాస్ బహెల్ దర్శకత్వంలో రూపొందబోయే డెడ్లీ(ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఈ శాండల్ వుడ్ బ్యూటీ ఫైనల్ ఆయనట్టుగా తెలిసింది. ఇందులో తనతో పాటు భారీ తారాగణం కూడా ఉంటుందట. నీనా గుప్తాను కూడా లాక్ చేశారు.

రిలయన్స్ సంస్థ నిర్మించే ఈ క్రేజీ మూవీని మార్చ్ 2021 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి తీసుకెళ్ళబోతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మిషన్ మజ్నులో తన సరసన సిద్దార్థ్ మల్హోత్రా ఉంటాడు కానీ ఈ డెడ్లీలో హీరో ఎవరనే క్లారిటీ లేదు. క్వీన్, సూపర్ 30 లాంటి టిపికల్ సబ్జెక్టులతో మెప్పించిన వికాస్ బహెల్ దీన్ని కూడా అదే త్వరలో సోషల్ మెసేజ్ తో పాటు ఎంటర్ టైనింగ్ తరహాలో తీయబోతున్నట్టు తెలిసింది. రష్మిక పాత్ర కూడా పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఇచ్చేలా ఉంటుందట. ఇప్పుడీ రెండు సినిమాలు కనుక రష్మికకు వర్కౌట్ అయితే బాలీవుడ్ లో గట్టి జెండానే పాతొచ్చు.

ప్రస్తుతం రష్మిక మందన్న అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉంది. బ్రేకులు పడుతూ లేస్తూ కొనసాగుతున్న ఈ షూట్ లో పాల్గొంటూనే ఉంది. చిత్తూర్ స్లాంగ్ ని ప్రత్యేకంగా నేర్చుకున్న రష్మిక ఇందులో గ్రామీణ యువతిగా నటించబోతోంది. బన్నీ సరసన ఫస్ట్ టైం కావడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కార్తీతో చేసిన సుల్తాన్ ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. థియేటర్లలో విడుదల చేస్తారా లేక ఓటిటికి వెళ్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి ఇంకా ఎంట్రీ జరగకుండానే బాలీవుడ్ లో రెండు ఆఫర్స్ పట్టేసిన రష్మిక అక్కడ సక్సెస్ అయితే ఇక్కడి దర్శకులకు దొరకడం కష్టమే.