iDreamPost
android-app
ios-app

డీసెంట్ రంగులు – వీకెండ్ వసూళ్లు

  • Published Mar 29, 2021 | 6:14 AM Updated Updated Mar 29, 2021 | 6:14 AM
డీసెంట్ రంగులు – వీకెండ్ వసూళ్లు

చాలా వీక్ గా ఉన్న అపోజిషన్ తో పాటు అంతో ఇంతో ఎంటర్ టైన్మెంట్ పరంగా పర్లేదు అనిపించే టాక్ రావడంతో రంగ్ దే కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం కొంత ప్రతికూలంగా మారినా జాతిరత్నాలు తర్వాత బాక్సాఫీస్ వద్ద ఉన్న ఆప్షన్ ఇదొక్కటే కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి మొగ్గు చూపడం బాగా ప్లస్ అవుతోంది. ముఖ్యంగా నితిన్ కీర్తి సురేష్ ల కాంబినేషన్ అట్రాక్ట్ చేస్తోంది. అయితే టికెట్ ధరల హైక్ ప్రభావాన్ని మాత్రం కొట్టిపారేయలేం. ఈ విషయం కాస్త సీరియస్ గా తీసుకుని ఉంటే ఇంకా మెరుగ్గా కలెక్షన్లు ఉండేవన్న అభిప్రాయాన్ని ఇక్కడ గమనించాలి. ఖచ్చితంగా ఫిగర్స్ లో మార్పు ఉండేది.

ఇక మూడు రోజులకు గాను సుమారు 12 కోట్ల 12 లక్షల షేర్ తో రంగ్ దే వీకెండ్ ని ముగించింది. ఇది చాలా డీసెంట్ ఫిగర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇవాళ్టి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఫైనల్ టార్గెట్ చేరుకోవడం ఉంటుంది. ఎందుకంటే రంగ్ దే ఇప్పటిదాకా తెచ్చింది థియేట్రికల్ బిజినెస్ లో సగం మాత్రమే. ఇంకా సగం రావాలి. అయితే అదంత సులభం కాదు. వీక్ డేస్ లో డ్రాప్ తో పాటుగా ఏప్రిల్ 1,2 తేదీల్లో రాబోతున్న కొత్త సినిమాలను కాచుకోవాలి. పైపెచ్చు రంగ్ దే ఖచ్చితంగా చూసే తీరాలి అనే టాక్ తెచ్చుకోలేదు. ట్రై చేయొచ్చు అనే మాటే ఇంత తెచ్చింది. ఇక ఏరియాల వారీగా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారీగా రంగ్ దే  మొదటి వారాంతం ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

ఏరియా  షేర్ 
నైజాం  3.90cr
సీడెడ్  1.45cr
ఉత్తరాంధ్ర  1.31cr
గుంటూరు  1.10cr
క్రిష్ణ  0.53cr
ఈస్ట్ గోదావరి  0.85cr
వెస్ట్ గోదావరి  0.54cr
నెల్లూరు  0.43cr
ఆంధ్ర+తెలంగాణా  10.02cr
రెస్ట్ అఫ్ ఇండియా 0.60cr
ఓవర్సీస్ 1.50cr
ప్రపంచవ్యాప్తంగా 12.12cr

ఇంకా బ్రేక్ ఈవెన్ చేరాలంటే మరో 12 కోట్లు రావాలి. అది ఈ వారం సాధ్యం కావడం కష్టమే. పైగా పోటీ కూడా ఉంది. నైజామ్ లో మాత్రమే రంగ్ దే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మిగిలిన చోట్ల కాస్త అప్ అండ్ డౌన్ కనిపిస్తోంది. ఇవాళ రేపు ట్రెండ్ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇవాళ హోలీ పండగ సెలవు కాబట్టి ఇది కలిసి వచ్చే ఛాన్స్ చాలా ఉంది. అలా చూసుకున్నా మహా అయితే కోటిన్నర కంటే ఎక్కువ దాటాకపోవచ్చు. మరి ఇంకా కొండంత బరువుతో కనిపిస్తున్న లక్ష్యాన్ని రంగ్ దే ఎలా చేరుకుంటుందో చూడాలి. ప్రమోషన్ వేగం పెంచే పనిలో ఉంది టీమ్.