iDreamPost
iDreamPost
మరీ భారీ అంచనాలు లేకపోయినా ఉన్న పోటీలో అన్నిటికంటే మెరుగ్గా కనిపించిన రంగ్ దే నిన్న థియేటర్లో డీసెంట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. నితిన్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి అరణ్య, ఈ కథలో పాత్రలు కల్పితం కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. ప్రోమోలు, పబ్లిసిటీ రంగ్ దేకు చాలా హెల్ప్ అయ్యాయి. చెక్ డిజాస్టర్ తాలూకు ప్రభావం దీని మీద ఉంటుందన్న అంచనా తప్పింది. ఆ ఫలితం గురించి మర్చిపోయి మరీ ప్రేక్షకులు దీన్ని ఫ్రెష్ గా చూశారు. అద్భుతాలు జరగలేదు కానీ లెక్కల్లో చూసుకుంటే మాత్రం రంగ్ దే ఆశించిన దాని కన్నా కొంచెం బెటర్ గా రాబట్టుకుంది.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సుమారు 5 కోట్ల 40 లక్షల దాకా షేర్ వసూలు చేసిన రంగ్ దే టార్గెట్ చేరుకోవాలంటే ఇంకా చాలా ప్రయాణం చేయాలి. 25 కోట్ల దాకా వస్తే కానీ బ్రేక్ ఈవెన్ దాటి బయ్యర్లు లాభాల్లోకి వచ్చినట్టు కాదు. కానీ ఇప్పుడీ సినిమాకు జాతిరత్నాలు, ఉప్పెన, క్రాక్ తరహాలో యునానిమస్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రాలేదు. కొంత డివైడ్ టాక్ నడుస్తోంది కూడా. ఫ్యామిలీ ప్లస్ యూత్ ఆడియన్స్ ఎంతమేరకు అండగా నిలుస్తారనే దాని మీద తర్వాత పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ వీకెండ్ ని పూర్తిగా వాడుకుని ఓ పది కోట్లయినా రాబడితే రికవరీ శాతం పెరుగుతుంది. ఏరియాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి
– ఏరియా వారీగా రంగ్ దే మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 1.51cr |
సీడెడ్ | 0.59cr |
ఉత్తరాంధ్ర | 0.56cr |
గుంటూరు | 0.66cr |
క్రిష్ణ | 0.21cr |
ఈస్ట్ గోదావరి | 0.52cr |
వెస్ట్ గోదావరి | 0.31cr |
నెల్లూరు | 0.24cr |
Total Ap/Tg | 4.60cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.26cr |
ఓవర్సీస్ | 0.54cr |
ప్రపంచవ్యాప్తంగా | 5.40cr |
ఓవర్సీస్ లో భారీ ఎత్తున షోలు ప్లాన్ చేయడం రంగ్ దేకు ప్లస్ అయ్యింది. కాకపోతే రన్ ని స్టడీగా కంటిన్యూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అపోజిషన్ వీక్ గా ఉంది కాబట్టి రంగ్ దే కు అడ్వాంటేజ్ పెరగనుంది. అందులోనూ వచ్చే వారం వైల్డ్ డాగ్, సుల్తాన్ రాబోతున్నాయి. ఆలోగా ఎంత రాబట్టుకుంటే అంత మంచిది. మరో వైపు జాతిరత్నాలు నెమ్మదించినా వీక్ ఎండ్స్ లో దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పుడు రంగ్ దే కూడా అదే స్థాయిలో టెంపో మైంటైన్ చేస్తేనే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరి అనుకూలతలు ఎక్కువగా ఉన్న రంగ్ దే ఫైనల్ గా లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి