iDreamPost
android-app
ios-app

పెళ్లికొడుకు కాబోతున్న భల్లాలదేవా రానా

  • Published May 12, 2020 | 12:31 PM Updated Updated May 12, 2020 | 12:31 PM
పెళ్లికొడుకు కాబోతున్న భల్లాలదేవా రానా

దగ్గుబాటి ఇంట్లో పెళ్లి బాజాలు మ్రోగబోతున్నాయి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన రానా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఎవరికో గాసిప్స్ కు అవకాశం ఇవ్వడం ఎందుకని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తనే ప్రకటించాడు. ఆ అమ్మాయి పేరు మిహికా బజాజ్. ప్రముఖ కృసాల జ్యువెలర్స్ అధినేత బంటీ బజాజ్ కూతురు. ఇది ప్రేమ వివాహమో లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళో తెలియదు కాని ఇద్దరూ కలిసున్న ఫోటోతో పాటు తను ఎస్ చెప్పింది అంటే సినిమా బాషలో లవ్ అనే అనుకోవాలి.

మరిన్ని కబుర్లు రానానే స్వయంగా చెప్పే అవకాశం ఉంది. లాక్ డౌన్ టైంలో ఇలాంటి స్వీట్ న్యూస్ షేర్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గత కొన్నేళ్ళుగా రానా పెళ్ళెప్పుడని మీడియా అడుగుతూనే ఉంది కాని దానికి ఈ హీరో మౌనమే సమాధానంగా చెబుతూ వచ్చాడు. ఈ వివాహం డిసెంబర్ లో ఉండే అవకాశం ఉంది. నిబంధనలు పూర్తిగా సడలించాక డేట్ ని ప్రకటించవచ్చు. సురేష్ బాబు మొదటి అబ్బాయి కావడంతో ఏర్పాట్లు గ్రాండ్ గా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

Link @ https://twitter.com/RanaDaggubati/status/1260166766061170695

రానా ప్రస్తుతం విరాట పర్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొంత వర్క్ తప్ప షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరొయిన్. ఇది కాకుండా అరణ్య రిలీజ్ కు రెడీగా ఉంది. ఏప్రిల్ 2 అని అనౌన్స్ చేశారు కాని కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడింది. ఇక భారీ బడ్జెట్ చిత్రం హిరణ్యకసిప సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించే ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి పెళ్లి ఫిక్స్ చేసుకున్న నిఖిల్, నితిన్ బ్యాచ్ లో రానా అఫీషియల్ గా చేరిపోయాడు.