iDreamPost
android-app
ios-app

వెంకటేష్ 75కి అబ్బాయి కాంబో ?

  • Published Nov 08, 2020 | 6:30 AM Updated Updated Nov 08, 2020 | 6:30 AM
వెంకటేష్ 75కి అబ్బాయి కాంబో ?

లాక్ డౌన్ వల్ల ఏడు నెలలు ఇంటికే పరిమితమైన విక్టరీ వెంకటేష్ ఇటీవలే నారప్ప షూటింగ్ కోసం సెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా సురేష్ సంస్థ ప్రత్యేకంగా రిలీజ్ చేసింది. ఇంకో పాతిక శాతం మాత్రమే బాలన్స్ ఉంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాక మార్చ్ లో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళ ఆసురన్ కు రీమేక్ ఆన్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కులవివక్షను ప్రశ్నిస్తూ రివెంజ్ డ్రామా ఫార్ములాలో సాగుతుంది. దీని మీదే ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

దీని సంగతలా ఉంచితే వెంకటేష్ 75వ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో అబ్బాయి రానా కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. నిన్న రానా ఒక ట్వీట్ చేస్తూ వివరాలేమీ చెప్పకుండా తామిద్దరం సినిమా చేయబోతున్నామని లాక్ డౌన్ టైంలో మంచి కథ దొరికిందని చెప్పాడు. అయితే దర్శకుడు ఎవరు లాంటి డీటెయిల్స్ ఏమి రివీల్ చేయలేదు ఇన్ సైడ్ టాక్ ప్రకారం అది డెబ్బై అయిదవ సినిమానే అయ్యుండొచ్చని తెలిసింది. ఇప్పటికే దీని కోసం తరుణ్ భాస్కర్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్టు వినికిడి. కాకపోతే అఫీషియల్ గా చెప్పలేదు అంతే.

ఇక రానా త్వరలో విరాట పర్వంలో పాల్గొనాల్సి ఉంది. వేణు ఊడుగుల డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సోషల్ మెసేజ్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేయడంతో హైప్ పెరిగింది. భారీ జనసందోహంతో కూడిన క్లైమాక్స్ తీయాల్సి ఉండటంతో సరైన సమయం కోసం యూనిట్ ఎదురు చూస్తోంది. ఈ కారణం వల్లే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హిరణ్యకశిపను కూడా పెండింగ్ లో పెట్టేశారు. అరణ్య ఎలాగూ సంక్రాంతికి వచ్చేస్తుంది. ఇవి కాకుండా ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కృష్ణం వందే జగద్గురుమ్ లో ఒక పాటలో తళుక్కున మెరిసిన వెంకీని పూర్తి స్థాయిలో రానా సినిమాలో చూడాలన్న ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరబోతోంది.