ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన రెడ్ ఇటీవలే సంక్రాంతికి విడుదలై కమర్షియల్ గా డీసెంట్ సక్సెస్ ని అందుకుంది. బయ్యర్లకు లాభాలను పంచింది. అభిమానులు ఆశించిన స్థాయి కాకపోయినా ఉన్నంతలో ఫ్లాప్ కాకుండా సేఫ్ గా బయట పడింది. నిజానికి రెడ్ కు వచ్చిన టాక్ కి ఫలితం విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ రెడ్ ప్రాఫిట్స్ తో గట్టెక్కింది. అయితే ఇప్పటిదాకా రామ్ తాను నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. ఆ మధ్య ఓ తమిళ దర్శకుడి పేరు వినిపించింది కానీ మళ్ళీ ఎలాంటి అప్ డేట్ లేదు. త్రివిక్రమ్ తోనూ ఉండొచ్చనే ప్రచారానికి చెక్ పడింది.
తాజా అప్డేట్ ప్రకారం రామ్ పందెం కోడి ఫేమ్ లింగుస్వామితో జతకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాల్ కు మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఇతని మీద ఇక్కడి ఆడియన్స్ కు కూడా మంచి గురి ఉంది. ఒకదశలో అల్లు అర్జున్ తనతో చేసేందుకు ఆసక్తి చూపించి ఓ స్టేజి మీద ప్రకటించాడు కూడా. కానీ ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. మసాలా ఎంటర్ టైనర్లను క్లాసు మాస్ మెచ్చేలా తీర్చిదిద్దుతాడని పేరున్న లింగుస్వామి అదే తరహాలో రామ్ కోసం ఒక సబ్జెక్టు రెడీ చేశాడట. అయితే కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న రామ్ నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
గత కొంత కాలంగా లింగు స్వామి ట్రాక్ రికార్డు అంత ఆశాజనకంగా లేదు. దానికి తోడు ప్రతి సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. 2010లో కార్తీ ఆవారా హిట్టయ్యాక 2012లో వెట్టై(తెలుగులో తడాఖా)బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత 2014లో సూర్యతో చేసిన సికందర్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దెబ్బకు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని 2018లో విశాల్ తో పందెం కోడి 2 తీస్తే అది డబ్బులు ఇచ్చింది కానీ లింగుస్వామి రేంజ్ మూవీ కాదనే టాక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2021లో తెలుగు హీరో మీద ఇలా కన్నేశారన్న మాట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే