Idream media
Idream media
జమ్మూ కశ్మిర్ లో వ్యాపారులపై ఉగ్రవాదుల దాడుల నిరోధానికి భద్రతా దళాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాయని బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చెప్పారు. జమ్మూ-కశ్మీరులో ట్రక్ డ్రవర్లపై దాడుల ద్వారా ఉగ్రవాదులు స్థానిక కశ్మీరీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు వారాల క్రితం రాజస్థాన్‌కు చెందిన ట్రక్ డ్రైవర్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికుడు కశ్మీరులో జరిగిన వేర్వేరు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. గురువారం షోపియాన్‌లోని చిత్రగామ్‌లో రెండు ట్రక్కులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఒకరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ పని కోసం కశ్మీరు వచ్చిన వ్యాపారులపై దాడుల ద్వారా ఉగ్రవాదులు వాస్తవానికి స్థానికుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనను మన భద్రతా దళాలు ఎదుర్కొంటాయని చెప్పారు.