iDreamPost
iDreamPost
గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రామ్ తనకొచ్చిన మాస్ ఇమేజ్ ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా చేసినదే రెడ్. మొదటిసారి కెరీర్ లో డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీ టీజర్ నిన్న విడుదలై అప్పుడే టాప్ ట్రెండింగ్ లో ఉంది. గతంలో ఇదే హీరోతో నేను శైలజ, ఉన్నదీ ఒకటే జిందగీ డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దీని బాధ్యతలు తీసుకున్నాడు. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.
ఇక టీజర్ విషయానికి వస్తే ఫ్యాన్స్ ఏది ఆశిస్తున్నారో అది పక్కాగా ఇందులో ఉన్నట్టు ఇచ్చే హామీతో పర్ఫెక్ట్ గా కట్ చేశారు. కెరీర్లో మొదటి సారి రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇద్దరూ కలుసుకునే సన్నివేశాన్ని కూడా ఇందులోనే రివీల్ చేసి సస్పెన్స్ ని బ్రేక్ చేసింది యూనిట్. అంటే ఒకరు ఉంటారా ఇద్దరు ఉంటారా అనే అనుమానాలకు తావివ్వకుండా క్లారిటీ ఇచ్చేశారు. క్రైమ్ తో పాటు బోలెడు థ్రిల్ ఇందులో ఉందనే విధంగా టీజర్ రూపొందించారు. రెడ్ లో రామ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.
నివేత పెతురాజ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా మాళవిక శర్మ, అమృతలు కూడా కనిపిస్తున్నారు. ఎవరు ఎవరితో రొమాన్స్ చేస్తారనే విషయం మాత్రం ఇందులో రివీల్ చేయలేదు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో రామ్ చాలా రఫ్ లుక్ తో ఉన్నాడు. రెండు షేడ్స్ ని బాగా క్యారీ చేసినట్టు కనిపిస్తోంది. అయితే టీజర్లో బాగా హైలైట్ అయ్యింది మణిశర్మ సంగీతం. తనకు మాత్రమే సాధ్యమయ్యే డిఫరెంట్ సెట్ అఫ్ టోన్ తో థ్రిల్లింగ్ ఫీల్ తీసుకొచ్చాడు. బోలెడు యాక్షన్ తో పాటు మాస్ కు కావాల్సిన అని అంశాలు పొందుపరిచినట్టు కనిపిస్తున్న రెడ్ టీజర్ మొత్తానికి ఫస్ట్ టెస్ట్ లో చక్కగా పాసైపోయింది. ఏప్రిల్ 9 విడుదల కానున్న రెడ్ కు బిజినెస్ ఆఫర్స్ కూడా భారీగా ఉన్నాయి.