iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ కు కరోనా : ఆ ప్రభావమేనా

  • Published Dec 29, 2020 | 4:31 AM Updated Updated Dec 29, 2020 | 4:31 AM
రామ్ చరణ్ కు కరోనా : ఆ ప్రభావమేనా

మొన్న ఆచార్య సెట్స్ లో అడుగుపెట్టి కాసేపు గడిపి వచ్చాడో లేదో ఇలా రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ వచ్చేసింది. ఇది తనే స్వయంగా ధృవీకరిస్తూ ట్వీట్ చేయడంతో టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ తిన్నారు. ఇప్పుడు ఈ వైరస్ రావడం పోవడం సాధారణమైనప్పటికీ మరీ తక్కువ అంచనా వేసి నిర్లక్ష్యం చేయడానికి లేదు. వయసు దృష్ట్యా చరణ్ కు ఎలాంటి రిస్క్ ఉండకపోవచ్చు కానీ గతంలో కొందరు సెలెబ్రిటీలు దీని వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారో చూసాం. ఒకరిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు చనిపోయారు కూడా. అందుకే అభిమానులు టెన్షన్ పడటం సహజం. అయితే తనకు ఎలాంటి సింప్టమ్స్ లేవని చరణ్ చెబుతున్నాడు.

గత కొద్దిరోజులుగా తనను కలిసిన వాళ్ళు టెస్ట్ చేయించుకోమని చెప్పాడు. అంటే దర్శకుడు కొరటాల శివతో సహా ఆచార్య టీమ్ మొత్తం మళ్ళీ పరీక్షలకు సిద్ధం కాక తప్పదు. చిరంజీవికి గతంలో ఇలా పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగటివ్ అని తేలిన సంగతి అందరికీ గుర్తే. అది టెస్టింగ్ లో జరిగిన లోపం వల్ల అని అర్థమయ్యింది. అయితే చరణ్ విషయంలో అలా జరక్కుండా జాగ్రత్తగా పరీక్షించి ఉంటారు కాబట్టి అపోలో టీమ్ అన్ని చెక్ చేశాకే కన్ఫర్మ్ చేసి ఉంటుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీని గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రమాదమేమీ లేకపోయినా చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

అదేంటో గానీ ఆర్ఆర్ఆర్ ను ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతూనే ఉంది. రాజమౌళి కుటుంబానికి సైతం కరోనా తప్పలేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. జనవరి నుంచే రామ్ చరణ్ ఆచార్య కోసం కాల్ షీట్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడీ పరిణామం వల్ల కొంత వాయిదా తప్పేలా లేదు. కాకపోతే మరీ ఎక్కువ రెస్ట్ అవసరం పడేలా లేదు. క్వారెంటైన్ పూర్తయ్యాక మరోసారి టెస్ట్ చేయించి అప్పుడు నెగటివ్ వస్తే ఇంకెలాంటి చింతా అక్కర్లేదు. ఏదైతేనేం చరణ్ ను గత వారం పది రోజుల్లో ఇంటరాక్ట్ అయినవాళ్ళు త్వరగా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.