మీడియా వార్తల ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులోకి నిన్నరాత్రికి 2,53,480 క్యూసెక్కుల నీరు చేరింది అంటే 21.90 టీఎంసీల నీరు చేరింది. Andhra Pradesh Water Resources Information & Management System dashboard ప్రకారం ఈ ఉదయం 9:22 నిముషాలకి 1,88,260 కుసెక్కులు అంటే 16.26 టీఎంసీ ల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వొస్తుంది .
శ్రీశైలం లో ఇప్పటికే 190.64 టీఎంసీ ల నీరు ఉంది. నాగార్జున సాగర్లో 300 టీఎంసీ (పూర్తి సామర్ధ్యం 312 టీఎంసీ),పులిచింతలో 44.28 టీఎంసీ (పూర్తి సామర్ధ్యం 45.77 టీఎంసీ ) మరియు ప్రకాశం బ్యారేజి లో 100% అంటే 3.07 టీఎంసీ ల నీరు ఉంది. అంటే ప్రతి ప్రాజెక్టు Flood Cushion పోను పూర్తిస్థాయిలో నిండింది రెండవ ఫొటో చూడండి.జూరాల నుంచి 1,93,202 కుసెక్కులు కిందికి వొదిలారు. జూరాల కింద ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ,ప్రకాశం బ్యారేజి అన్ని కూడ ఇప్పటికే దాదాపు పూర్తిగా నిండి ఉన్నాయి. మరోవైపు తుంగభద్ర నుంచి 80,000 క్యూసెక్కులు నీటిని కిందికి వొదిలారు,ఈ నీరు శ్రీశైలానికి చేరుతుంది.ఈ లెక్కలు చూస్తే రేపు ఉదయానికి శ్రీశైలానికి కనీసం 2లక్షల 50 వేళా క్యూసెక్కుల నీరు చేరుతుంది,ఈ ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగుతుంది.
మొన్న బాబుగారి కరకట్ట ఇంటిని కూల్చటానికే పోతిరెడ్డి పాడు నుండి నీళ్లు ఆలస్యంగా విడుదల చేశారని ,అది ప్రభుత్వం సృష్టించిన వరద అని ఆరోపించిన టీడీపీ నాయకులు ముఖ్యంగా మాజీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమాగారు ఇప్పుడొస్తున్న వరదకు మరోసారి బాబుగారి కరకట్ట ఇల్లు మునగకముందే బాబుగారి ఇంటి క్షేమాన్ని కోరుకునేవాళ్ళు ఇప్పుడే బయటకొచ్చి పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్ధ్యం 44,000 క్యూసెక్కులు ,హంద్రీ-నీవా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చెయ్యండి.
ఇంత వరద వస్తుంది కాబట్టి శ్రీశైలంలో ఎన్ని అడుగుల నీరు ఉంటె నీటిని ఏప్రాధాన్యతలో విడుదలచేయాలని నిర్ధేశించే operational guidelines ను పక్కన పెట్టి కనీసం పదిరోజుల పాటు inflow తో సంబంధం లేకుండ పోతిరెడ్డి పాడు నుంచి 44,000 క్యూసెక్కులు(దీనిలో 75% పైగా నీరు SRBC ,GNSS కు + కుందు-పెన్నా ద్వారా సోమశిల,కండ్లేరుకు చేరుతుంది ) తోడి బ్రహ్మంసాగర్ కు కనీసం 8- 10 టీఎంసీ లు, ఈ నెల మొత్తం హంద్రీ-నీవా నుంచి 2500 నీటిని తోడి అనంతపురంలోని జీడిపల్లి,గొల్లపల్లి ప్రాజెక్టులను 2 టీఎంసీ లతో నింపి తదుపరి కర్నూల్ జిల్లా గాజులదిన్నె ప్రాజెక్టులో 5 టీఎంసీల నీటిని నింపమని కూడా చెప్పండి. ముఖ్యమంత్రి జగన్ గారు వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కు కాలువలో కనీసం 2500 క్యూసెక్కుల నీరు పోవటంలేదు. తెలుగు గంగ కాలువను వెడల్పు చేసి ,లైనింగ్ చేసే పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. అదే విధంగా హంద్రీ-నీవా కాలువ ను కూడా కనీసం 5000 క్యూసెక్కుల తీసుకెళ్ళేలాగా వెడల్పు చేపించండి.