ఆంధ్రప్రదేశ్ అన్న దాతలకు శుభ వార్త. పెట్టుబడి సాయం 12,500 రూపాయల నుంచి 13,500 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తిసుకుంది. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పేరు కింద ఈ మొత్తం 3 దశల్లో అందించనున్నారు. ఖరీఫ్ ప్రారంభం అయ్యే మే నెల లో 7,500 రూపాయలు, రబీ సీజన్ ప్రారంభం అయ్యే అక్టోబర్ లో 4,000 రూపాయలు, పంట ఇంటికి వచ్చే సంక్రాతి సమయం జనవరి లో 2,000 రూపాయలు చొప్పున మొత్తం 13,500 రూపాయలు అందించనున్నారు. ఈ సాయం 5 ఏళ్ళు పాటు అందిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లడించారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఏడాదికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్ళు పాటు రూ 50,000 అందిస్తామని పేర్కొనగా తాజాగా సాయం పెంచడంతో పాటు 5 ఏళ్ళు అందిచనున్నారు. తాజా నిర్ణయం తో రైతులకు 5 ఏళ్ల లో రూ. 67,500 సహాయంగా అందనున్నది.