రాష్ట్రంలో భారీ వర్షాలు కురుసున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్షాలు, వరదలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. వర్షాల కారణంగా పంట నష్టం, ఆస్తి నష్టంపై ఆయన అధికారులతో చర్చించారు. పంట నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా వెంటనే అంచనాలను సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జలవనరులశాఖ మంత్రి సమీక్ష..
రాష్ట్రంలో వరదలపై నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సమీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇరిగేషన్ కార్యలయంలో ఆయన అన్ని జిల్లాల నీటిపారుదల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలోని జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితి ఆరా తీశారు. అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్ద రింగ్‌బండ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు