iDreamPost
iDreamPost
గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ రాధే శ్యామ్ హైబ్రిడ్ మోడల్ లో రిలీజ్ చేసేందుకు జీ ప్లెక్స్ ఓటిటి యువి సంస్థతో చర్చలు జరుపుతోందన్న వార్త డార్లింగ్ ఫ్యాన్స్ ని కొంత ఖంగారు పెట్టింది. అంటే ఓటిటిలో పే పర్ వ్యూ మోడల్ లో, ఓవర్సీస్ లో థియేటర్లో రిలీజ్ చేయడమన్న మాట.దాని కోసం భారీ ఆఫర్ కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది. వాస్తవానికి అసలు రాధే శ్యామ్ నిర్మాతలకు ఆ ఆలోచన కూడా లేదని ఫ్రెష్ అప్ డేట్. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం కోట్లాది రూపాయల బడ్జెట్ ని మంచి నీళ్లలా ఖర్చు పెట్టి తీసిన ఇలాంటి విజువల్ వండర్స్ కు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కనీసం దరిదాపుల్లోకి కూడా రాదనేది నగ్న సత్యం.
సో రాధే శ్యామ్ ఇటీవలే వచ్చిన రాధే మోడల్ లో రిలీజ్ కావడం అసాధ్యమని తేలిపోయింది. విడుదల తేదీ కాస్త అటుఇటు అయినా కూడా దేశవ్యాప్తంగా పరిస్థితులు సాధారణంగా మారినప్పుడే ఈ గ్రాండియర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. ఇంకో వారం రోజుల వర్క్ బాలన్స్ ఉందట. లాక్ డౌన్ కాగానే అది పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తారు. ఈసారి కరోనాను పూర్తిగా విశ్లేషించాక కానీ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ లేదు. పైగా పిల్లల మీద ప్రభావం చూపించే థర్డ్ వేవ్ గురించి జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్లు ఇవ్వడం దగ్గరి కాలంలో డౌటే.
అసలు చిన్న సినిమాలు కూడా ఎందుకనో డిజిటల్ బాటను పట్టలేకపోతున్నాయి. వేచిచూసే ధోరణినే అవలంబిస్తున్నాయి. రాధే శ్యామ్, కెజిఎఫ్, మేజర్, ఆచార్య లాంటివి థియేటర్ ని డిమాండ్ చేస్తాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం నిర్భయంగా ప్రతి చిన్న సినిమాను హాల్ లోకి వచ్చి చూసేంత సీన్ ఉండదు. కొంత టైం పడుతుంది. అందులోనూ రాబోయే రోజుల్లో పిల్లల మీద వైరస్ ప్రభావం ఉంటుందని ఊహాగానాలు రేగుతున్న తరుణంలో కుటుంబాలు థియేటర్ కు రావడం అనుమానమే. ఏది ఏమైనా రాధే శ్యామ్ ఎంత ఆలస్యమైనా పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే కిక్కు. ఇది మనకంటే ఎక్కువగా ఆ టీమ్ కే బాగా తెలుసు