రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియడ్ లవ్ స్టోరీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రావడం లేదని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకూ సంగీత దర్శకుడిని ఫైనలైజ్ చెయ్యలేదు.
మొదట్లో బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేదిని ఎంచుకున్నారని వార్తలు వచ్చాయి కానీ ఆయన ఆ వార్తలను ఖండించారు. ఈ మధ్య ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఇంతవరకూ ఎటువంటి సమాచారం రాలేదు. ఇదిలా ఉంటే లేటెస్ట్ టాక్ మరోలా ఉంది. ఈ సినిమాకు ‘సాహో’ తరహాలోనే ఒక్కో పాటను ఒక్కొకరి చేత కంపోజ్ చేయించాలని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకరికి ఇవ్వాలని నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారు భావిస్తున్నారట.
ఆలా అనుకున్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే సంగీత దర్శకుడిని ఫైనలైజ్ చేస్తే కానీ టీజర్, ట్రైలర్ లు రిలీజ్ చేసే అవకాశం ఉండదు. అప్పటివరకూ డార్లింగ్ అభిమానులకు వెయిటింగ్ తప్పదేమో.