iDreamPost
android-app
ios-app

2022 – మొదటి పాన్ ఇండియా రిలీజ్

  • Published Jul 30, 2021 | 5:05 AM Updated Updated Jul 30, 2021 | 5:05 AM
2022 –  మొదటి పాన్ ఇండియా రిలీజ్

ఎట్టకేలకు రాధే శ్యామ్ నుంచి పక్కా అప్ డేట్ వచ్చేసింది. అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ చేస్తూ విడుదల తేదీని 2022 జనవరి 14కి లాక్ చేసుకుంది. అఫీషియల్ గా తేదీతో సహా విడుదల చెప్పిన మొదటి సినిమాగా రాధే శ్యామ్ నిలిచింది. సర్కారు వారి పాట, పవన్ రానాల సినిమాలు కూడా సంక్రాంతి సీజనే అని చెప్పినప్పటికీ ఇలా స్పష్టంగా డిక్లేర్ చేయడం మాత్రం ఇదే మొదటిది. ఈ ఏడాది చివరిలోగా రాధే శ్యామ్ రావొచ్చన్న అంచనాలకు బ్రేక్ వేస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించేదే అయినా దీని వెనుక చాలా తెలివైన ఎత్తుగడ కనిపిస్తోంది. అంతకు మించి మార్కెటింగ్ ప్లానూ ఉంది.

ఇప్పుడు నిర్మాణంలో ఉన్న అధిక శాతం పాన్ ఇండియా సినిమాలన్నీ సంక్రాంతి మీదే కన్నేశాయి. ఒకవేళ ఫేస్ టు ఫేస్ క్లాష్ చేసే పరిస్థితి కనక తీవ్రమైతే ముందు ఎవరు ప్రకటించారనేది చాలా కీలకం అవుతుంది. మేము ముందే చెప్పేశామనే అడ్వాంటేజ్ రాధే శ్యామ్ కు ఖచ్చితంగా ఉంటుంది. అంతే కాక మిగిలిన నిర్మాతలకు సైతం ఒక హింట్ ఇచ్చినట్టు అవుతుంది. మేం ఫిక్స్ అయ్యాం కాబట్టి మీరు రేస్ లో ఉంటారా లేదా డిసైడ్ చేసుకోండని స్పష్టంగా చెప్పినట్టే. రాధే శ్యామ్ మీద ఉన్న అంచనాల మేరకు చూసుకుంటే నేరుగా తలపడటం అంత ఈజీ కాదు. పైగా బిజినెస్ ప్లస్ స్క్రీన్ కౌంట్ విషయంలో దీనికి దగ్గరగా రావడం సులభం కాదు.

సో ఇంకా అయిదు నెలల సమయం ఉండగానే సంక్రాంతి రేస్ వేడెక్కిపోయింది. ఒకవేళ రాధే శ్యామ్-సర్కారు వారి పాట-పవన్ మూవీ కనక బాక్సాఫీస్ వద్ద నిజంగా ఒకేసారి తలపడితే టాలీవుడ్ లో అతి పెద్ద పోరుగా దాన్ని వర్ణించొచ్చు. వచ్చే నెల నుంచి రాధే శ్యామ్ టీమ్ ప్రమోషన్ వేగాన్ని పెంచబోతోంది. లిరికల్ వీడియోలు, ప్రోమోలు,మేకింగ్ టీజర్లు, ట్రైలర్, పోస్టర్లు ఒకటా రెండా మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన గ్రాండియర్ కి మాములు పబ్లిసిటీ ఇస్తే సరిపోతుందా. అందుకే దానికి తగ్గట్టు ప్రణాళికలతో యువి టీమ్ పక్కా ప్లానింగ్ తో ఉంది. డేట్ ని ఫైనల్ చేయడంతోనే ఇది స్టార్ట్ అయ్యిందిగా.

Also Read:రికార్డు దాటలేకపోయిన వకీల్ సాబ్