iDreamPost
iDreamPost
అది కుతుబ్‌మినార్ కాదు సూర్య గోపురం అంటున్నారు ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ. దీని నిర్మాత రాజవిక్రమాదిత్య.అంతేకాని, కుతుబ్ అలల్ దిన్ ఐబాక్ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదో శతాబ్దంలో రాజావిక్రమాదిత్య సూర్యుడిని చూసేందుకు, సూర్య గమనాన్ని పరిశోధించేందుకు సూర్యగోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి అంటున్నారు.
తాజ్‌మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం సద్దుమణగక మునుపే ఇదో కొత్త వివాదం రగులుతోంది. స్మారక కట్టడాలపై వివాదాలు ముదురుతున్న వేళ కుతుబ్ మినార్ గురించి కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. అందరూ అనుకొంటున్నట్లు ఇది కతుబ్‌మినార్ కాదు సూర్యగోపురం అంటే సన్ అబ్జర్వేటరీ టవర్ అని కూడా చెప్పారు. ఆర్కియాలజీ సర్వేలో పనిలో భాగంగా కుతుబిమినార్‌లో చాలాసార్లు సర్వే చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇంకో సంగతి కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉంది. జూన్ 21న సూర్యస్తమయ సమయంలో కనివిందు చేసే నీడ, ఇక్కడ కనీసం అరగంటైనా ఏర్పడదన్న ఒక కొత్త విషయాన్ని కూడా ధర్మవీర్ శక్తి ప్రకటించారు. కుతుబ్‌మినార్ అనేది ఖగోళ పరిశోధనకు నిర్మించిన స్వతంత్ర నిర్మాణమే గానీ, మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, దీనికి కారణం, రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ మరో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
27గుళ్లను పగలగొట్టి కుతుబ్ మినార్ ను కట్టారు
కుతుబ్ మినార్ నిర్మాణంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఓ వ్యాఖ్య చేశారు. కుతమ్ మీనార్ మీదున్న శాసనాన్ని బట్టి, దీన్ని 27 దేశాలను ధ్వంసం చేసి, వాటితో నిర్మాంచారని, ఇలాంటి కట్టడం ఇండియా తప్ప మరెక్కడా అలా నిలబడి ఉండదని అన్నారు. 2019 నుంచి 2021 వరకు పటేల్ సంస్కృతి శాఖ మంత్రిగా ఉన్నారు.