మామూలుగానే అల్లు అర్జున్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన అభిమానులు ఆయన సినిమా కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడులోనూ అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారంతా ఇప్పుడు పుష్ప సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ , రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ పుష్ప: ది రైజ్ ‘ డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే కోట్లలో జరగడంతో సినిమా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు సినిమా యూనిట్. అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటి సారిగా ఒక డీ గ్లామర్ రోల్ లో నటించడం, ఆ డీ గ్లామర్ రోల్ కోసం ఆయన పడిన కష్టం అంతా స్క్రీన్ మీద కనిపిస్తోంది.
ఇక ‘పుష్ప: ది రైజ్’ అన్ని రైట్స్ ఇప్పుడు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ టోటల్ బిజినెస్ దాదాపు రూ. 250 కోట్ల మార్క్ కి చేరుకుంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా విడుదల అవుతున్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాన్-థియేట్రికల్ అంటే డిజిటల్ రైట్స్ తో కలిపి 250 కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు సమాచారం. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత ఇటువంటి ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి పెద్ద తెలుగు సినిమాగా పుష్ప నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్ గా నటించే ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
అలా మొత్తం మీద మేకర్స్ పుష్ప సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా చేశారన్న టాక్ వినపడుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ భరద్వాజ్, సునీల్, హరీష్ ఉత్తమన్, వెన్నెల కిషోర్, రావు రమేష్ మరియు అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందించారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం పుష్ప కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకోనుంది అనేది.ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ ‘తగ్గేదేలే’ అంటున్న ‘పుష్ప’ !
Also Read : హాట్ కేకుల్లా హాలీవుడ్ సినిమా టికెట్లు