iDreamPost
android-app
ios-app

పంజాబ్ ఎఫెక్ట్ .. అక్కడ కూడా సీఎం మార్పు?

పంజాబ్ ఎఫెక్ట్ .. అక్కడ కూడా సీఎం మార్పు?

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన పంజాబ్ సీఎం మార్పు, కాంగ్రెస్ హైకమాండ్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేలా ఉంది. ఓ సమస్యను పరిష్కరించే క్రమంలో మరో సమస్యను సృష్టించుకున్నట్లు తయారైంది కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితి. పంజాబ్ కాంగ్రెస్ లో రాజుకున్న చిచ్చును అర్పేందుకు సీఎం అభ్యర్థిని మార్చిన హస్తం పార్టీకి .. ఆ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్ గడ్ లో కూడా అదే ఫార్ములా రిపీట్ చేయాల్సి వచ్చేలా ఉంది.

ఛత్తీస్ గడ్ లో 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలైన భూపేశ్ బాఘేల్, టీఎస్ సింగ్ డియో, పోటీ పడ్డారు. అయితే అప్పట్లో ఐదేళ్ల పదవీకాలాన్ని చెరి సగం పంచుకునేలా ఒప్పందం జరిగినట్లు సింగ్ డియో వర్గం నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందంపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ‘మొదటి రెండున్నర ఏళ్ల కాలానికి భూపేశ్ బాఘేల్ ను సీఎంగా ఎంపిక చేసిందని… . తర్వాతి ఎపిసోడ్ కు సింగ్ డియోకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనేది అప్పుడు పార్టీ పెద్దల మధ్య జరిగిన ఒప్పందమని’ ప్రచారం జరిగింది. అయితే జూన్ తో భూపేశ్ బాఘేల్, రెండున్నరేళ్ల పదవీ కాలన్నీ పూర్తి చేసుకున్నప్పటీ సీఎం మార్పు జరగలేదు.

కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర అధికార మార్పిడి గురించి చర్చ జరిగినప్పటికీ సీఎం మార్పు విషయమై ఎలాంటి మార్పు రాలేదు. భూపేశ్ ప్రభుత్వంలో సింగ్ డియో ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. రాహుల్ గాంధీతో ఆగస్టులో భూపేశ్ బాఘేల్ తో పాటు సింగ్ డియో సమావేశమై మూడు గంటలు పాటు చర్చించారు. కొన్ని నెలలుగా పలుమార్లు ఈ అంశంపై కాంగ్రెస్ చర్చించినప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. రాహుల్ తో సమావేశం తర్వాత మీడియతో మాట్లాడిన సీఎం భూపేశ్, రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు పర్యటనకు రావాలని కోరినట్లు తెలిపారు.

Also Read : ఆ ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేయదు! బీజేపీలో యడ్డీ వ్యాఖ్యల కలకలం

సీఎం మార్పుతో పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభానికి ఎండ్ పడిన రోజుల వ్యవధిలోనే సింగ్ డియో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే తన పర్యటన వ్యక్తిగతమైనదని డియో చెబుతున్నారు. అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని మీడియాకు చెబుతున్నా ఎదో జరగబోతుందనే విషయం అర్థమవుతోంది.

అమరిందర్ తప్పించి చరణ్ సింగ్ చన్నిని సీఎం గా ఎంపిక చేయడానికి కాంగ్రెస్ పెద్ద కసరత్తే చేసింది. కొన్ని నెలల పాటు సమస్యను అధ్యయనం చేసి సర్దుబాటు కు యత్నించింది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే సీఎంను మార్చింది. అమరిందర్ పై దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తగా ఉండటం, ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని అంచనా వేసిన కాంగ్రెస్.. తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త సీఎంను ఎంపిక చేసింది. నష్ట నివారణలో భాగంగానే సీఎం మార్పు వంటి సాహసం కాంగ్రెస్ చేసినట్లు విశ్లేషకులు చె బుతున్నారు.

పంజాబ్ అంకంతో ఛత్తీస్ గడ్ ను పోల్చినప్పుడు సారుప్యమున్న అంశాలు లేవు. ఎందుకంటే భూపేశ్ బాఘేల్ నాయకత్వంపై ఎమ్మెల్యేలు బహిరంగంగా, అంతర్గతంగా ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత లేని సీఎంను మార్చినప్పుడు మరో విధంగా కాంపాన్సేట్ చేయాల్సి ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే రాజ్యసభకు నామినేట్ చేయడమో గర్నరర్ గా ప్రమోషన్ ఇవ్వడమో చేసి బుజ్జిగించేంది. కానీ పరిస్థితి వేరుగా ఉంది. ఎమ్మెల్యేల్లో గాని ప్రజల్లో గాని వ్యతిరేకత లేనప్పుడు సీఎంను మార్చడం అంత సులువైన విషయం కాదు.

అధికార మార్పిడి ఒప్పందం జరిగి ఉండి ఉంటే..దానిని ఇరు పక్షాలు గౌరవిస్తే సమస్యలేదు. ఏ ఒక్కరు విభేదించిన అది కాంగ్రెస్ కు నష్టం చేస్తుంది. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ కు స్కిండియా మధ్య వర్గ పోరు జరిగినప్పుడు హైకమాండ్ కమల్ నాథ్ వైపే ఉంది. దీంతో స్కిండియా బీజేపీలో చేరి కేంద్రమంత్రి అయ్యారు. మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Also Read : అఖాడా పరిషత్ మహంత్ నరేంద్ర గిరి,సహజ మరణమేనా?