iDreamPost
android-app
ios-app

పునాదిరాళ్ళు

పునాదిరాళ్ళు

కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే సాధారణ యువకుడు పద్మభూషణ్ ‘మెగాస్టార్’ చిరంజీవిగా ఎదగడానికి వెనుక ఉన్న కథ … తన నలభై సంవత్సరాల సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు నటించిన 151 చిత్రాల నుంచి – నలభై సినిమాలను ఎంపిక చేసి వాటి పై తనదైన శైలిలో విశ్లేషణలు, విశేషాలు, ఆయా సినిమాలకు పని చేసే సమయంలో చిరంజీవి చూపిన శ్రద్దాసక్తులు – ఒక్కో పాత్రలోని చిరంజీవి కనబరిచిన అసమాన నట వైదుష్యం, వాటి నుంచి నేటి తరం వర్ధమాన నటులు తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాల సమాహారం … ఈ ‘పునాదిరాళ్ళు’ పుస్తకం. చిరంజీవి అభినయకౌశలం పాఠకుల కళ్ళకు కట్టేలా రచయిత విశదీకరించిన పలు అంశాల్లో – వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విషయాలూ ఉండడం ఈ పుస్తకం ప్రత్యేకత.

పలు పత్రికల్లో ఈ పుస్తకం గురించి ప్రచురించిన రివ్యూలోని ముఖ్య అంశాలు …

“విశేషాలు సేకరించడానికి కష్టపడినప్పటికీ చాలా ఇష్టంగా ప్రెజెంట్ చేశారు. ఎన్నో తెలియని విషయాలను తెలియజెప్పిన ఈ పుస్తకం చిరంజీవి అభిమానులకు ఒక కరదీపిక” – ఆంధ్రజ్యోతి

“ఓ విధంగా చిరంజీవి నలభై చిత్రాలకు సంబంధించిన ఓ పాజిటివ్ విమర్శ ఈ పుస్తకంలో కనిపించింది. వాటితో పాటు తెర వెనుక సంగతుల్ని పంచుకున్నారు” – సితార

“చిరంజీవి నటించిన నలభై సినిమాలు తీసుకుని ఒక గ్రంథాన్ని వెలువరించి అభిమాన నటుడికి హారతి పట్టాడు” – ఆంధ్రప్రభ

ఈ పుస్తకం రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలయ్యి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి.