భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పిఎస్ఎల్ వి-సీ 47 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రయాన్ – 2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి పిఎస్ఎల్ వి-సీ 47 ప్రయోగం మంగళవారం ఉదయం 9.28 నిమిషాలకు ప్రారంభించారు. సుమారు 26 గంటల 50 నిముషాలు జరిగిన ఈ ప్రయోగంలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పిఎస్ఎల్ వి-సీ 47 ప్రవేశపెట్టింది. కార్టోశాట్-3 తో పాటుగా అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్య లోకి ప్రవేశపెట్టారు.
కార్టోశాట్ 3 జీవితకాలం 5 సంవత్సరాలు,బరువు సుమారు 1625 కిలోలు. కార్టోశాట్ 3 ని మూడవతరం హైరెజెల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ సాటిలైట్ గా చెప్పుకోవచ్చు. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి వనరులకు సంబంధించి సేవలను కార్టోశాట్ 3 అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్ 3 స్పష్టంగా గుర్తించనుంది.